Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Wednesday, 26 February 2020

బాబు విశాఖ పర్యటన.. టీడీపీ vs వైసీపీ పోటాపోటీ.. తీవ్ర ఉద్రిక్తతలు

టీడీపీ అధినేత విశాఖ పర్యటన నేపథ్యంలో నగరంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. చంద్రబాబు ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వనప్పటికీ.. బాబుకు స్వాగతం పలకడానికి భారీ సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు తరలివచ్చారు. మరోవైపు శ్రేణులు బాబు పర్యటనను అడ్డుకోవడానికి ప్రయత్నించాయి. వైసీపీ కార్యకర్తలు బాబు కాన్వాయ్ ముందు బైఠాయించి నిరసన చేపట్టారు. చంద్రబాబు గో బ్యాక్ అని నినాదాలు చేశారు. కొందరు ఆందోళనకారులు చంద్రబాబు కాన్వాయ్‌పై చెప్పులు విసిరారు. దీంతో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఇది ఉద్రిక్తతలకు దారి తీసింది. ఉత్తరాంధ్ర ద్రోహి చంద్రబాబు నాయుడు గో బ్యాక్ అని వైసీపీ శ్రేణులు నినాదాలు చేయగా.. పోటీగా టీడీపీ శ్రేణులు జై చంద్రబాబు అని నినాదాలు చేశాయి. కొందరు వైసీపీ కార్యకర్తలు రోడ్డు మీద బైఠాయించి బాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీరిని పోలీసులు వెనక్కి పంపారు. చంద్రబాబుకు స్వాగతం పలకడానికి వచ్చిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, పల్లా శ్రీనివాస్‌ను వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యే వెలంగపూడి రామకృష్ణ బాబు, వైసీపీ శ్రేణుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు భారీ సంఖ్యలో ఎయిర్‌పోర్టుకు చేరుకోవడంతో.. భారీగా పోలీసులను మోహరించారు. ఎయిర్‌పోర్టుకు వెళ్లే మార్గాన్ని పోలీసులు తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. తీవ్ర ఉద్రిక్తతల మధ్యే చంద్రబాబు నాయుడు విశాఖలో అడుగుపెట్టారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ చేస్తామని జగన్ సర్కారు ప్రకటించింది. కాగా మూడు రాజధానుల నిర్ణయాన్ని ఖండించింది. ఏపీ రాజధాని విషయమై రగడ మొదలైన తర్వాత తొలిసారి చంద్రబాబు విశాఖ వచ్చారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయడం ఇష్టంలేని చంద్రబాబును నగరంలో అడుగుపెట్టగానే అడ్డుకుంటామని అంతకు ముందే వైసీపీ నేతలు ప్రకటించారు. మరోవైపు బాబుకు ఘన స్వాగతం పలకడం ద్వారా విశాఖ ప్రజలు బాబు నిర్ణయానికి వ్యతిరేకంగా లేరని చాటాలని టీడీపీ భావించింది. అదే సమయంలో విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేసే విషయంలో టీడీపీని ఇరుకున బెట్టాలనే వ్యూహాన్ని వైసీపీ రూపొందించింది.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2VoC7GC

No comments:

Post a Comment