
సీఎం జగన్‌పై అభిమానం చాటుకునే ప్రయత్నంలో ఆయన స్కూల్‌మేట్‌తోపాటు మరొకరు ప్రాణాలు వదిలారు. ఈ విషాద ఘటన విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పట్టణంలోని శ్రీరామ్ నగర్‌కు చెందిన ఏడిద జగదీష్ చిన్నతనంలో వైఎస్ జగన్‌తో కలిసి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. ఆయనకు జగన్ అంటే ఎంతో అభిమానం. ఇటీవల వైఎస్సార్సీపీ అధినేత పాదయాత్ర చేపట్టినప్పుడు.. అనకాపల్లిలో ఆయన్ను జగదీష్ కలిశారు. చిన్నతనంలో కలిసి చదువుకున్నప్పటి ఫొటోలు, పాదయాత్రలో పాల్గన్నప్పుడు కలిసి దిగిన ఫొటోలతో జగదీష్ భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేయించారు. ఈ ఫ్లెక్సీని ఇంటి ముందు కట్టడం కోసం గురువారం డాబా మీదకు ఎక్కారు. ఇందుకోసం ఆయన దూరపు బంధువైన ముప్పిడి శ్రీను అనే వ్యక్తం సాయం కోరారు. ఇద్దరూ ఫ్లెక్సీ కడుతుండగా.. ఒక్కసారిగా గాలి వీయడంతో అది ఇంటి ముందున్న హైటెన్షన్ విద్యుత్ తీగలపై పడింది. హైటెన్షన్ వైర్ల నుంచి విద్యుత్ సరఫరా కావడంతో ఇద్దరికీ కరెంట్ షాక్ తగిలింది. ఇద్దర్నీ వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లగా జగదీష్ అప్పటికే చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించారు. శ్రీను హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు. జగన్ ఫ్లెక్సీ కట్టే క్రమంలో ఇద్దరు ప్రాణాలు వదలడంతో.. వారి కుటుంబాలతోపాటు అనకాపల్లి వైఎస్సార్సీపీ శ్రేణుల్లో విషాదం నెలకొంది. జగదీష్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉండగా.. వ్యక్తిగత కారణాల రీత్యా ఆయన భార్యకు దూరంగా ఉంటున్నారు.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/32yXK8J
No comments:
Post a Comment