Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Thursday, 27 February 2020

‘హిందూత్వ’పై చర్చకు సుప్రీం గ్రీన్ సిగ్నల్.. శబరిమల కేసు తర్వాత విచారణ

‘హిందుత్వ’ను ఓ జీవన విధానంగా గతంలో నిర్వచించిన తీర్పు విషయమై దాఖలైన రివ్యూ పిటిషన్‌పై విచారణను వేగవంతం చేస్తామని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది. ఎన్నికల సమయంలో హిందుత్వ నినాదంతో ఓట్లను అడిగే అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించాలని అనుకూల, వ్యతిరేక వర్గాల వాదనలు వింటామని సుప్రీంకోర్టు తెలిపింది. శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పించాలన్న తీర్పుపై రివ్యూ పిటిషన్లు విచారణ పూర్తయిన తర్వాత ఈ అంశంపై విచారణ చేపడతామని ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. శబరిమల అయ్యప్ప ఆలయం కేసును తొమ్మిది మంది న్యాయమూర్తుల విస్తృత రాజ్యాంగ ధర్మాసనం మార్చి 16 నుంచి రోజువారీ విచారణ చేపడుతుందని జస్టిస్ బాబ్డే పేర్కొన్నారు. జస్టిస్ ఎస్ ఏ బాబ్డే నేతృత్వంలోని ఈ ధర్మాసనంలో జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ మోహన్ ఎం శాంతనగౌండర్, జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ సభ్యులుగా ఉన్నారు. ఈ ధర్మాసనంలోని ఓ న్యాయమూర్తికి స్వైన్‌ఫ్లూ సోకడంతో విచారణ ఆలస్యమైందని జస్టిస్ బాబ్డే తెలిపారు. ప్రస్తుత కేసు 1992 నుంచి పెండింగ్‌లోనే ఉందని, 1990 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలతో సంబంధం ఉన్న ఈ కేసులో తన క్లయింట్ అభిరామ్ సింగ్‌ తప్ప ఇప్పటికే పలువురు అభ్యర్థులు నిర్దోషులుగా బయటపడ్డారని సీనియర్ లాయర్ అరవింద్ దాతార్ వాదనలు వినిపించారు. ఈ కేసును తొలుత ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనానికి, తర్వాత ఐదుగురు న్యాయమూర్తుల ధర్మసనం.. చివరకు ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనానికి బదిలీ చేశారు.. మతం, కులం, వర్గం, భాష ప్రాతిపదికన ఓట్లు అడిగే అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉందా అనే అంశంపై విచారణ చేపట్టనుంది. ఈ అంశంపై తర్వగా విచారణ చేపట్టాలని లాయర్ దాతర్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ బాబ్డే మాట్లాడుతూ.. హిందూత్వ నిర్వచనంపై మరోసారి పునఃసమీక్షించాలని ప్రతివాదులు కోరుతున్నారని అన్నారు. ‘హిందుత్వ’తీర్పును సరిచేయాలని వారు కోరుతున్నారని, ఈ అంశంపై సుదీర్ఘ సమయం పడుతుందని భావిస్తున్నామన్నారు. శబరిమల కేసులో విచారణ పూర్తయిన తర్వాత ఈ పిటిషన్ వాదనలు వినడానికి ప్రయత్నిస్తామని అన్నారు. కాగా, ఎన్నికల ప్రచారంలో హిందూత్వ లేదా హిందూయిజం పేరుతో ఓట్లను అడగడం ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 123లోని సబ్-సెక్షన్ (3) లేదా (3ఏ) ప్రకారం అనర్హులుగా పేర్కొలేమని1995 డిసెంబరు 11 నాటి రమేశ్ యశ్వంత్ ప్రభూ కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ‘హిందూ’,‘హిందుత్వం’‘హిందూ మతం’ అనే పదాలకు కచ్చితమైన అర్ధాన్ని ఆపాదించలేమని.. భారతీయ సంస్కృతి, వారసత్వ విషయాలను మినహాయించి మతం పరిమితం చేయలేం... ‘హిందుత్వ’ అనే పదం భారత ఉప ఖండంలోని ప్రజల జీవన విధానంతో ఎక్కువ సంబంధం కలిగి ఉందని కూడా సూచించబడింది’ అని సుప్రీం వ్యాఖ్యానించింది.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/397YX9E

No comments:

Post a Comment