
హైదరాబాద్‌లోని అల్వాల్ ప్రాంతంలో రౌడీషీటర్ హత్య తీవ్ర కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తులు అతడిని బండరాళ్లతో కొట్టి పెట్రోలు పోసి తగలబెట్టినట్లు తగలబెట్టారు. వెంకటాపురం కొత్తబస్తీకి చెందిన మైఖేల్ డిసౌజ(30)పై రౌడీషీట్ ఉంది. బుధవారం రాత్రి అతడు స్థానికులతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం 8 గంటల ప్రాంతంలో అతడి ఇంటి ముందే మృతదేహం కాలిపోతుండటాన్ని చుట్టుపక్కలవారు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. హత్యానంతరం నిందితులు మృతదేహాన్ని అతడి ఇంటి వద్దకే ఈడ్చుకువచ్చిన ఆనవాళ్లున్నట్లు పోలీసులు చెబుతున్నారు. Also Read: ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఇప్పటికే ప్రాథమిక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. పోలీసు జాగిలాలు బస్తీ వీధుల్లో తిరిగాయి. బుధవారం రాత్రి డిసౌజను అతడి ఇంటి వద్దే చూసినట్లు స్థానికులు చెబుతున్నారు. నేరంలో ఆరుగురు వ్యక్తుల పాత్ర ఉన్నట్లు ప్రాథమికంగా తెలిసింది. సీసీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అతడిని ఎక్కడో చంపేసి తీసుకొచ్చి ఇంటి వెనక వీధిలో పెట్రోలు పోసి తగలబెట్టారని పోలీసు అధికారులు భావిస్తున్నారు. Also Read: ఇదీ నేపథ్యం.. వెంకటాపురం కొత్తబస్తీకి చెందిన మైఖేల్ డిసౌజ(30) పెయింటర్‌గా పనిచేస్తూ జీవించేవాడు. చెడు అలవాట్లకు బానిసై మైఖేల్ జులాయిగా తిరుగుతూ స్థానిక వ్యాపారులను బెదిరించి డబ్బులు గుంజుకునేవాడు. ఎవరైనా ఎదురు తిరిగితే దౌర్జన్యం చేసేశాడు. ఈ క్రమంలోనే అతడిపై అనేక కేసులు నమోదయ్యాయి. కొన్ని సందర్భాల్లో పోలీసులను సైతం బెదిరించడంతో అతడిపై 2015లో రౌడీషీట్ తెరిచారు. దీంతో కుటుంబసభ్యులు అతడిని దూరం పెట్టారు. ఓ వ్యక్తిని బెదిరించి డబ్బులు దోచుకున్న కేసులో జైలుశిక్ష అనుభవించి ఏడు నెలల క్రితమే బయటకు వచ్చాడు. తర్వాత బస్తీలోని ఓ వర్గం యువకులతో కలిసి మరో వర్గంపై దాడికి పాల్పడ్డాడు. అప్పట్లో ప్రత్యర్థులు అతడి ఇంటిని దహనం చేశారు. ఈ క్రమంలో బస్తీని వీడి చెన్నైలోని బంధువుల ఇంట్లో ఉంటూ కొన్నాళ్లుగా హైదరాబాద్‌కి వచ్చివెళుతున్నాడు. బుధవారం ప్రత్యర్థి వర్గంతో జరిగిన ఘర్షణ నేపథ్యంలోనే అతడిని హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2I1iv3z
No comments:
Post a Comment