Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Thursday, 27 February 2020

ఢిల్లీ హింస: మురికాల్వల్లో తేలుతున్న శవాలు.. 38కి చేరిన మృతులు

ఈశాన్య ఢిల్లీ హింసాత్మక ఘటనలో మృతిచెందినవారి సంఖ్య 38కి చేరింది. కొన్ని మృతదేహాలు మురికి కాల్వల్లో గుర్తించగా, మరి కొందరు తీవ్ర గాయాలతో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతిచెందారు. జోహ్రి ఎన్‌క్లేవ్ ప్రాంతంలోని మురికి కాల్వలో ఓ వ్యక్తి మృతదేహం గురువారం మధ్యాహ్నం గుర్తించారు. ఘర్షణలు గురువారం నాటికి కాస్త తగ్గుముఖం పట్టినా పరిస్థితి మాత్రం పూర్తిగా అదుపులోకి రాలేదు. అంతటా నివురు గప్పిన నిప్పులా ఉంది. అల్లర్లలో భారీగా ఆస్తుల విధ్వంసం కొనసాగగా, ఎటుచూసినా కాలిపోయిన గోడలు, వాహనాలు, గాజు పెంకులు, చెల్లాచెదురుగా పడి ఉన్న రాళ్లు దర్శనమిస్తున్నాయి. శుక్రవారం ఉదయానికి క్షేత్రస్థాయిలో ఉద్రిక్తత తగ్గుముఖం పడితే ఓ పది గంటల పాటు 144 సెక్షన్‌ను సడలించనున్నారు. మరోవైపు, అల్లర్లకు బాధ్యులైన 130 మందిని అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు.. మరో 400 మంది అదుపులోకి తీసుకుని 48 ఎఫ్ఐఆర్‌లు నమోదుచేశారు. ఐబీ ఆఫీసర్ అంకిత్ శర్మ హత్యలో ఆమ్ ఆద్మీ పార్టీ కౌన్సెలర్ తాహీర్ హుస్సేన్ ఆయన అనుచరుడిపై కేసు నమోదయ్యింది. తర్వలోనే ఆయనను అరెస్ట్ చేయనున్నారు. ఐబీ ఆఫీసర్ హత్య కేసు సహా అల్లర్ల కేసులను క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీచేసిన పోలీసులు.. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేశారు. అల్లర్ల వెనుక భారీ కుట్రే ఉన్నట్టు సిట్ అనుమానిస్తోంది. పోలీసుల అనుమానాలకు బలం చేకూరేలా అల్లర్ల జరిగిన ప్రదేశాల్లో బాటిల్ బాంబ్ లాంచర్లు, తాడుతో అనుసంధానం చేసిన హ్యాండ్ గ్రనేడ్లు లభ్యమైనట్టు తెలుస్తోంది. ఈ ఏర్పాట్లు అన్ని ఒక్క రాత్రిలో జరిగే పనికాదని, భారీగా కసరత్తు చేశారని విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి. మరోవైపు, బాధితులకు ఢిల్లీ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. క్షతగాత్రుల వైద్య ఖర్చులతోపాటు మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, ఇల్లు, దుకాణాలు కోల్పోయినవారికి రూ.5 లక్షలు పరిహారం చెల్లించనున్నట్టు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. సహాయ పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షించడానికి 18 మంది సబ్-డివిజినల్ మేజిస్ట్రేట్లను నియమించారు. ఈశాన్య ఢిల్లీలో పరిస్థితిపై లెఫ్టినెంట్ గవర్నర్ గురువారం సమీక్ష నిర్వహించి, పోలీసులకు దిశనిర్దేశనం చేశారు. పోలీసులు గస్తీ కొనసాగించాలని, అవసరమైతే అదనపు బలగాలను మోహరించాలని సూచించారు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి చెందిన ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, ఫోటో బృందాలు అల్లరు జరిగిన ప్రాంతాల్లో పర్యటించిన అక్కడ ఆధారాలను సేకరించారు. పోలీసుల సమన్వయంతో దగ్దదం చేసిన వాహనాలు, జంతువుల మృతదేహాలను తొలగిస్తున్నారు. ఘర్షణల్లో దెబ్బతిన్న రహదారులు, ప్రభుత్వ ఆస్తులు, మందిరాలు, మసీదులను మరమ్మతు చేయడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2T9wWcl

No comments:

Post a Comment