ప్రపంచాన్ని కలవర పెడుతున్న ప్రాణాంతక తీవ్ర రూపం దాల్చుతున్న వేళ దాని కట్టడి దిశగా భారత్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. చైనాను సందర్శించిన విదేశీయులు, చైనీయులకు జవనరి 15 తర్వాత జారీ చేసిన అన్ని వీసాలను భారత్ రద్దు చేసింది. దీనికి సంబంధించి చైనాలోని భారత రాయబార కార్యాలయం ట్విటర్ ద్వారా ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం వరుసగా నాలుగు ట్వీట్లు చేసింది. Also Read: ‘‘ పౌరులు, గత రెండు వారాల్లో చైనాను సందర్శించిన వివిధ దేశాల వారు భారత్‌కు వెళ్లేందుకు ప్రస్తుతం తమ వద్ద ఉన్న వీసాలను ఉపయోగించుకోవచ్చా అని పర్యటకుల నుంచి మాకు అనేక ప్రశ్నలు వస్తున్నాయి. అయితే ఆ వీసాలను భారత ప్రభుత్వం రద్దు చేసింది. అవి ఇకపై పని చేయవు. రద్దు అయిన వారంతా భారత్‌కు రావాలంటే వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.’’ Also Read: ‘‘సాధారణ లేదా ఈ-వీసా ద్వారా చైనా నుంచి భారత్‌కు వెళ్లిన చైనీయులు లేదా ఇతర దేశాల వారు (జవనరి 15 తర్వాత వెళ్లినవారు మాత్రమే) వెంటనే కేంద్ర ఆరోగ్యశాఖ ఏర్పాటు చేసిన హాట్ లైన్ నంబరు +91-11-23978046 లేదా ncov2019@gmail.com మెయిల్ ఐడీని సంప్రదించవచ్చు. అని చైనాలోని భారత రాయబార కార్యాలయం మరో ట్వీట్ చేసింది. మరోవైపు, ఇటీవల చైనీయులకు లేదా కొన్ని దేశాల నుంచి భారత్‌కు వచ్చే వారికి ఇప్పటికే వీసా సదుపాయాన్ని తాత్కాలికంగా నిలిపేసిన సంగతి తెలిసిందే. తాజాగా చైనాను సందర్శించిన పర్యటకులకు కూడా వీసాలను రద్దు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2GPgQh0
No comments:
Post a Comment