Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Tuesday, 25 February 2020

బాలాకోట్‌పై భారత వైమానిక దాడులకు ఏడాది.. ఆరోజు జరిగిందంటే?

భారత వైమానిక దళం బాలాకోట్‌లో వైమానిక దాడులు చేసి నేటికి (ఫిబ్రవరి 26) సరిగ్గా ఏడాది పూర్తయ్యింది. పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో ఉన్న శివార్లలో ఉన్న ఉగ్రస్థావరాలపై మెరుపు దాడులు చేసింది. 1971 యుద్ధం తర్వాత భారత బలగాలు అంతర్జాతీయ సరిహద్దు దాటి ముందు జాగ్రత్త చర్యగా దాడులు చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 2019 ఫిబ్రవరి 14న పాకిస్థాన్ అండతో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ కశ్మీర్లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై దాడి చేసింది. ఈ ఘటనలో 40 మంది జవాన్లు అమరులయ్యారు. ఈ దాడికి ప్రతీకారంగా భారత్ బాలాకోట్‌పై మెరుపు దాడులు చేసింది. 78 వాహనాల్లో 2547 మంది జవాన్లను తరలిస్తుండగా.. వీరిని లక్ష్యంగా చేసుకొని జైషే మహ్మద్‌కి చెందిన ఓ ఉగ్రవాది భారీ పేలుడు పదార్థాలతో కూడిన వాహనంతో సీఆర్పీఎఫ్ కాన్వాయ్ వైపు దూసుకొచ్చాడు. 40 మంది జవాన్లను బలిగొనడం కోసం ఆత్మాహుతి దాడికి పాల్పడిన వ్యక్తి 80 కిలోల పేలుడు పదార్థాలను ఉపయోగించాడని తేలింది. ఆర్మీ చరిత్రలోనే భారీ స్థాయిలో నష్టం వాటిల్లడంతో.. పుల్వామా దాడి తర్వాత భారతీయులు పాకిస్థాన్ పట్ల ఆగ్రహంతో రగిలిపోయారు. పాక్ రాయబారికి భారత్ సమన్లు జారీ చేసింది. పాక్ మిత్ర దేశం చైనా కూడా ఈ దాడిని ఖండించింది. భద్రతా దళాలు నచ్చిన సమయంలో, తాము కోరుకున్న చోట దాడి చేసి పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు అనుమతి ఇస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. శత్రువుకు దిమ్మతిరిగే రీతిలో బుద్ధి చెప్పేందుకు ఎంత తీవ్రంగా దాడి చేస్తారో మీ ఇష్టమన్నారు. ప్రతి భారతీయుడి గుండె రగిలిపోతోందని ప్రధాని భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. పుల్వామా దాడి జరిగిన 12 రోజుల తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్లు బాలాకోట్‌లోని జైషే మహ్మద్ ఉగ్రవాద క్యాంపులపై బాంబులు జాడ విరిచాయి. వివిధ ఎయిర్‌బేస్‌ల నుంచి బయల్దేరిన భారత యుద్ధ విమానాలు ఫిబ్రవరి 26న తెల్లవారుజామున జమ్మూ కశ్మీర్లో వాస్తవాధీన రేఖను దాటాయి. స్పైస్ 2000 గైడెడ్ మిస్సైళ్లతో ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ దాడుల్లో జైషే మహ్మద్‌కు చెందిన శిక్షణా శిబిరం ధ్వంసమైంది. భారీ సంఖ్యలో ఉగ్రవాదులు, శిక్షకులు, సీనియర్ కమాండర్లు, జిహాదీలు ప్రాణాలు వదిలారు. బాలాకోట్ దాడులకు ప్రతీకారంగా పాకిస్థాన్ ఫైటర్ జెట్లు.. మన సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడుల కోసం భారత గగనతలంలోకి ప్రవేశించాయి. క్రిష్ణ ఘాట్, నంగి టెక్రీ వద్ద ఉన్న ఆర్మీ బేస్‌లతోపాటు నరియన్ వద్ద ఉన్న అమ్యునిషన్ పాయింట్ లక్ష్యంగా దాడులకు దిగాలని పాక్ ఫైటర్ జెట్లు భావించాయి. కానీ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వెంటనే రంగంలోకి దిగి పాక్‌ ప్రణాళికల్ని భగ్నం చేసింది. భారత యుద్ధ విమానాలు పాక్ యుద్ధ విమానాలను వెంబడించాయి. ఈ క్రమంలో వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్.. మిగ్-21 బైసన్ యుద్ధ విమానం ద్వారా పాక్‌కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కుప్పకూల్చాడు. కమ్యూనికేషన్ వ్యవస్థ సరిగా పని చేయకపోవడంతో.. అభినందన్ పాకిస్థాన్‌ గగనతలంలోకి ప్రవేశించాడు. అభినందన్ కూల్చిన విమానంతోపాటు.. ఆయన ప్రయాణిస్తున్న విమానం సైతం పాక్‌లో కూలిపోయాయి. పారాచ్యూట్ సాయంతో కిందకు దిగిన అభినందన్‌ను పాక్ బంధించింది. ఇద్దరు భారతీయ పైలెట్లను పట్టుకున్నామని పాక్ ప్రకటించింది. కానీ మరో పైలెట్ పాకిస్థానీ పైలెట్ అని తర్వాత తేలింది. ఈలోగా పాక్ రేంజర్లు అతణ్ని భారత పైలెట్‌గా పొరబడి అతణ్ని చితకబాదారు. అనంతరం అతణ్ని మిలిటరీ హాస్పిటల్‌లో చేర్పించారు. తమ ఎఫ్-16 యుద్ధ విమానం కూలిపోయిందన్న విషయాన్ని పాకిస్థాన్ ఇప్పటి వరకూ అంగీకరించడం లేదు. 60 గంటలపాటు పాకిస్థాన్‌లో బంధీగా ఉన్న అభినందన్ వర్థమాన్‌ను మార్చి 1న దాయాది విడిచిపెట్టింది. దీంతో భారత్, పాక్ మధ్య యుద్ధం తప్పింది.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2vj3ebv

No comments:

Post a Comment