Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Tuesday, 25 February 2020

బై బై ట్రంప్.. చైనాకు చెక్ పెట్టేలా భారత్-అమెరికా ఒప్పందం, అది మాత్రం..

అమెరికా అధ్యక్షుడు రెండు రోజుల భారత పర్యటన ముగిసింది. మంగళవారం రాత్రి ఆయన స్వదేశానికి బయల్దేరి వెళ్లారు. భారత్‌లో కోటి మంది తనకు స్వాగతం పలుకుతారని ట్రంప్ గొప్పగా చెప్పుకున్నారు. కానీ తొలిసారి భారత గడ్డ మీద ఆయనకు ఆ స్థాయిలో కాకున్నా భారీ సంఖ్యలోనే ప్రజలు స్వాగతం పలికారు. సోమవారం ట్రంప్ అహ్మదాబాద్‌లో విమానం దిగిన తర్వాత.. ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మోదీపై ట్రంప్ ప్రశంసలు గుప్పించారు. ట్రంప్ భారత్ పర్యటన సందర్భంగా వాణిజ్య ఒప్పందం కుదురుతుందని భావించారు. కానీ ఈ ఒప్పందం మాత్రం కుదరలేదు. భారత్‌తో 25 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు ఉందని ట్రంప్ ఆరోపించారు. ఇది సరికాదన్న ఆయన.. ఈ అంతరాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. భారత్ తమ ఎగుమతులపై భారీగా సుంకాలు విధిస్తోందని ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇరు దేశాలు తమ స్వీయ ప్రయోజనాలకు పెద్ద పీట వేయడంతో వాణిజ్య ఒప్పందం మాత్రం కుదరలేదు. ఒప్పందం కుదరనప్పటికీ... ఆ దిశగా ఇరు దేశాల మధ్య చర్చలు కొనసాగే అవకాశం ఉంది. అమెరికా నుంచి 3 బిలియన్ డాలర్ల విలువైన హెలికాఫ్టర్లు, ఇతర సైనిక పరికరాలను కొనుగోలు చేయడం కోసం భారత్ ఒప్పందం చేసుకుంది. భారత్‌కు అత్యాధునిక అపాచీ, ఎంహెచ్ 60 రోమియో హెలికాప్టర్లను అందజేస్తామని ట్రంప్ ప్రకటించారు. ఈ ఒప్పందం ప్రకారం వచ్చే మూడేళ్లలో భారత్‌కు 24 ఎంహెచ్‌-60 రోమియో సీహాక్‌ హెలికాప్టర్లను, 12 ఏహెచ్‌ 64ఈ అపాచీ హెలికాప్లర్లను అమెరికా సరఫరా చేయనుంది. చైనాకు చెక్‌ పెట్టడం కోసమే భారత్‌తో అమెరికా 3 బిలియన్ డాలర్ల (రూ.21 వేల కోట్లు) విలువైన రక్షణ ఒప్పందాలను కుదుర్చుకుంది. ఎంహెచ్‌-60 రోమియో సీహాక్‌ హెలికాప్టర్లు శత్రు జలాంతర్గాములను పసిగట్టి దాడులు చేయటానికి ఉపకరిస్తాయి. ఏహెచ్‌ 64ఈ అపాచీ హెలికాప్టర్లను బోయింగ్ సంస్థ భారత్‌లోనే తయారు చేయనుంది. వీటికి అవసరమైన కొన్ని విడిభాగాలను బోయింగ్‌-టాటా అనుబంధ సంస్థ హైదరాబాద్‌లో తయారు చేయనుంది. ఆరోగ్య, ఇంధన రంగాల్లో ఇరు దేశాలు మూడు ఒప్పందాలు చేసుకున్నాయి. మానసిక ఆరోగ్యంపై భారత్, అమెరికా ఎంవోయూపై సంతకాలు చేశాయి. వైద్య ఉత్పత్తుల భద్రతపై అమెరికా ఆహార-మందుల శాఖ పరిధిలోని సెంట్రల్‌ డ్రగ్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌తో ఎంవోయూ కుదిరింది. ఇంధన రంగంలో సహకారంపై ఐఓసీ(ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌), ఎక్సాన్‌ మొబైల్‌ ఇండియా ఎల్‌ఎన్‌జీ లిమిటెడ్‌, అమెరికాకు చెందిన చార్ట్‌ ఇండస్ర్టీస్‌ ఇంక్‌ మధ్య ఒప్పందం కుదిరింది. ఎక్సాన్ మొబిల్‌తో కుదిరిన ఒప్పందం కారణంగా భారత్ అమెరికా నుంచి మరింతగా లిక్వి‌ఫైడ్ నేచురల్ గ్యాస్‌ను అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటుంది.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2wOD5BV

No comments:

Post a Comment