
తనపై అనేకసార్లు అత్యాచారం చేసి గర్భవతిని చేసిన యువకుడు తర్వాత దొంగచాటుగా పెళ్లి చేసుకుని ఇప్పుడు మొహం చాటేశాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో జిల్లా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Also Read: కొత్తపేట ఎస్.ఐ కె.రమేష్ కథనం ప్రకారం... కొత్తపేట మండలంలో ఓ గ్రామానికి చెందిన యువతి(22) గత ఏడాది బాత్రూమ్‌లో స్నానం చేస్తున్న సమయంలో అదే గ్రామానికి చెందిన లంక చినబాబు అనే యువకుడు సెల్‌ఫోన్లో వీడియో తీశాడు. దాన్ని చూపించి యువతిని బెదిరించిన యువకుడు అనేకసార్ల అత్యాచారానికి పాల్పడ్డాడు. ఫలితంగా యువతి గర్భం దాల్చింది. విషయం యువతి తల్లిదండ్రులకు చెప్పగా వారు యువకుడి పెద్దలతో మాట్లాడారు. వాళ్లు స్పందించకపోవడంతో యువతి గతేడాది డిసెంబర్ 18న పోలీసులకు ఫిర్యాదు చేసింది. Also Read: దీంతో చినబాబు ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పి కేసు వాపసు తీసుకునేలా చేశాడు. అనంతరం పెద్దల సమక్షంలో దండలు మార్చుకుని పెళ్లి చేసుకున్నాడు. కొద్దిరోజుల తర్వాత ఆమె గర్భానికి తనకు సంబంధం లేదని ఇంట్లో నుంచి గెంటేశాడు. దీంతో మరోసారి మోసపోయానని గ్రహించిన యువతి మంగళవారం కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2HW4d4f
No comments:
Post a Comment