
జిల్లా వేములవాడలో కత్తిదాడి కలకల రేపింది. రాజు అనే వ్యక్తిపై మంగళవారం రాత్రి కొందరు దుండుగులు పిడిగుద్దులు కురిపించి కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన రాజు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మున్సిపల్ ఎన్నికలే ఈ దాడికి కారణంగా తెలుస్తోంది. Also Read: ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మూడో వార్డు నుంచి విజయ్ అనే వ్యక్తి టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి కౌన్సిలర్‌గా గెలుపొందాడు. దీంతో అతడిపై కక్ష పెంచుకున్న ప్రసాద్ అనే వ్యక్తి మంగళవారం రాత్రి తన మనుషులతో కలిసి విజయ్ సోదరుడు రాజుపై హత్యాయత్నం చేశారు. అతడి ఇంటికి చేరుకున్న కొందరు దుండగులు రాజును బయటకు లాగి పిడిగుద్దులు కురిపిస్తూ కత్తితో పలుమార్లు పొడిచారు. Also Read: తీవ్రంగా గాయపడిన రాజును స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. రాజు, ప్రసాద్‌కు కొంతకాలంగా వ్యాపార విభేదాలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. అయితే తొలుత రాజు వర్గీయులే ప్రసాద్‌పై దాడికి పాల్పడ్డారని, వారి నుంచి రక్షణ కోసమే అతడు కత్తితో దాడికి పాల్పడినట్లు ప్రసాద్ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వేములవాడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3c3g0eZ
No comments:
Post a Comment