Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Tuesday, 25 February 2020

ప్రశాంత్ కిశోర్‌కు ఫుల్ డిమాండ్.. ఐప్యాక్ సేవల కోసం మరో పార్టీ యత్నాలు!

ఏపీ ఎన్నికల్లో వైఎస్ జగన్ ఘన విజయం సాధించడం, ఇటీవలి ఎన్నికల్లో ఢిల్లీలో కేజ్రీవాల్ తిరిగి గెలుపొందడంతో.. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌కు డిమాండ్ పెరిగింది. ఆయనతో కలిసి పని చేయడం కోసం పార్టీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. మహారాష్ట్ర ఎన్నికల్లో శివసేన కోసం ఐప్యాక్ టీం పని చేయగా.. బెంగాల్లో మమతా బెనర్జీ, తమిళనాడులో డీఎంకే పీకేతో కలిసి పని చేయడానికి అవగాహన కుదుర్చుకున్నాయి. తాజాగా ఈ బాటలో జేడీఎస్ కూడా చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రశాంత్ కిశోర్‌తో జేడీఎస్ నేత, కర్ణాటక మాజీ సీఎం మంగళవారం భేటీ అయ్యారు. పార్టీ భవిష్యత్తు కోసం ఏం చేయాలనే అంశాన్ని చర్చించారు. తొలి విడత చర్చలు జరిగాయని, మిగతా అంశాలను తర్వాత వెల్లడిస్తానని కుమారస్వామి తెలిపారు. 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ 37 సీట్లను గెలుపొందింది. కాంగ్రెస్ మద్దతుతో కుమారస్వామి సీఎం అయ్యారు. కానీ 2019 లోక్ సభ ఎన్నికల్లో 28 సీట్లకు గానూ ఆ పార్టీ కేవలం ఒక్క చోట మాత్రమే గెలుపొందింది. పార్టీ మూలపురుషుడు దేవేగౌడ కూడా ఓటమి పాలయ్యారు. గతేడాది డిసెంబర్లో నిర్వహించిన ఉప ఎన్నికల్లో 15 స్థానాలకు పోటీ చేయగా.. జేడీఎస్ ఒక్క స్థానాన్ని కూడా గెలవలేకపోయింది. పరిస్థితి చేజారుతుండటంతో.. ఎన్నికల్లో గెలవడం కోసం సేవలను పొందాలని కుమారస్వామి నిర్ణయించారని తెలుస్తోంది. జేడీఎస్ ఉపాధ్యక్షుడిగా పని చేసిన ప్రశాంత్ కిశోర్.. సీఏఏ, ఎన్ఆర్సీ విషయాల్లో బీజేపీని వ్యతిరేకించారు. దీంతో జేడీయూ నుంచి నితీశ్ కుమార్ సస్పెండ్ చేశారు. ప్రస్తుతం ప్రశాంత్ కిశోర్ బిహార్‌పై ఫోకస్ పెట్టారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3caEl2w

No comments:

Post a Comment