Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Monday, 24 February 2020

ట్రంప్‌కి ముక్కలేనిదే ముద్ద దిగదు.. ఇక్కడంతా శాకాహారమే, అధికారుల్లో ఆందోళన!

తొలిసారి భారత్‌కు విచ్చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ఘనస్వాగతం లభించిన విషయం తెలిసిందే. తొలి రోజు పర్యటన ఆద్యంతం అత్యంత స్నేహపూరిత వాతావరణం సాగింది. రెండో రోజు ఢిల్లీలోనే ట్రంప్ గడపనున్నారు. మంగళవారం సాయంత్రం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ విందు ఇవ్వనున్నారు. ఈ విందుకు ఎనిమిది మంది ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. ఇదిలా ఉండగా ముక్కలేనిదే ట్రంప్‌నకు ముద్ద దిగదు. ఆయన ఎక్కడి వెళ్లినా ఆహారం విషయంలో అధికారులు జాగ్రత్తలు తీసుకుంటారు. Read Also: ఈ విషయంలో రాజీపడని అమెరికా అధికారులు.. ప్రస్తుతం భారత్ పర్యటనలో మాత్రం పూర్తిగా శాకాహార వంటకాలనే చేర్చడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా తయారుచేయించిన మెనూలో అన్నీ శాకాహార పదార్ధాలే ఉండటం విశేషం. సలాడ్‌తో కూడిన భోజనం మినహా ట్రంప్‌ శాకాహార పదార్థాలు తినడం తాను ఒక్కసారి కూడా చూడలేదని, ఈసారి ఏం జరుగుతుందోనంటూ ఓ అధికారి వాపోయారు. Read Also: ట్రంప్‌ సాధారణంగా ఉడికించిన లేదా కాల్చిన మాంసం, బీఫ్‌ బర్గర్లు, మీట్‌లోఫ్ (మాంసంతో చేసిన రొట్టెలు) ఆహారంలో తీసుకుంటారని, విదేశీ పర్యటనల్లో స్టీక్స్‌ అందుబాటులో లేకుంటే గొర్రె మాంసం ఉంటుందన్నారు. మెక్‌డొనాల్డ్‌లో లభించే బీఫ్‌ బర్గర్లు అంటే ట్రంప్‌కి చాలా ఇష్టమని, అయితే ఇక్కడ బ్రాంచీల్లో చికెన్‌ బర్గర్లు మాత్రమే లభిస్తాయని పేర్కొన్నారు. శాకాహారి అయిన ప్రధాని మోదీ... ట్రంప్‌ కోసం ప్రధానంగా గుజరాత్‌లో ప్రసిద్ధ వంటకం ఖమన్‌తోసహా వెజ్‌ బర్గర్లు, మల్టీగ్రెయిన్‌ రొట్టెలు, బ్రొకొలీ/మొక్కజొన్న సమోసాలు, వివిధ రకాల తేనీరు, కొబ్బరి నీళ్లు, మరెన్నో వంటకాలు సిద్ధం చేశారు. మంగళవారం సాయంత్రం రాష్ట్రపతి ఇచ్చే విందులోనూ దాదాపు ఇలాంటి వంటకాలే ఉండన్నాయి.ఇక, సోమవారం సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించిన ట్రంప్, మెలానియాలు అక్కడ అందుబాటులో ఉంచిన ఖమన్‌తోసహా ఏదీ రుచి చూడలేదని ఆశ్రమ ట్రస్టీ కార్తికేయ తెలిపారు. Read Also: ఇదిలా ఉండగా గతంలో భారత్ పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షులకు కూడా స్థానిక వంటకాలనే రుచిచూపించారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు 2006లో భారత్‌కు వచ్చిన అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్‌కి స్థానిక వంటకాలైన కూరలు, బిరియానీ, సీఫుడ్స్ వడ్డించారు. ఇక, భారత్‌లో రెండుసార్లు పర్యటించిన ఏకైక అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబమా భారతీయ వంటకాలను ఎంతో ఇష్టంగా లొట్టలేసుకుంటూ తిన్నారు. చికెన్ షామీ కెబాబ్, ఆచారీ షిఫ్ టిక్కా, పిస్తా ముర్ఘ్, మస్టర్డ్ ఫిష్ కర్రీ, గుస్తాబా, ఆచారీ పన్నీర్ లాంటి వంటకాలను ఒబమా రుచిచూశారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2VhzJBs

No comments:

Post a Comment