
ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని నూజివీడు ఐఐటీ లేడీస్ హాస్టల్‌లోకి దూరిన ఓ యువకుడు రాత్రంతా ప్రియురాలితో గడిపిన ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. సెక్యూరిటీ గార్డులు తలుపులు పగులగొట్టి లోపలికి రావడంతో యువతి తన ప్రియుడిని మంచం కింద దాచింది. విద్యాలయాల్లోని హాస్టళ్లలో భద్రత లోపాన్ని ఈ ఘటన ఎత్తిచూపింది. సరిగ్గా ఇలాంటి ఘటనే తెలంగాణలోనూ జరిగింది. Also Read: ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలోని ఓ లేడీస్ హాస్టల్‌లోకి ఓ యువకుడు చొరబడ్డాడు. ఈ నెల 17న మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కుమురంభీం జిల్లాకు చెందిన ఓ యువకుడు ప్రహరీ గోడ దూకి వెంటిలేటర్ గుండా హాస్టల్‌లోకి చేరాడు. యువకుడి గ్రామానికే చెందిన ఓ బాలిక అదే హాస్టల్ ఉంటూ ఇంటర్ సెకండియర్ చదువుతోంది. ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం సాగుతుండటంతో ప్రియురాలిని చూసేందుకు అతడు అక్కడికి చేరుకున్నాడు. రాత్రంతా ఆమెతోనే గడిపాడు. అదే గదిలో మరో ముగ్గురు బాలికలు ఉన్నా ఈ విషయం బయటకు పొక్కలేదు. Also Read: తర్వాతి రోజు ఉదయం గది శుభ్రం చేయడానికి వెళ్లిన సిబ్బంది యువకుడిని గమనించి ప్రిన్సిపల్‌కు సమాచారం అందించారు. ఆయన ఎంఈవోకి సమాచారం ఇవ్వగా ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు హాస్టల్‌కు చేరుకుని యువకుడు, విద్యార్థినికి కౌన్సెలింగ్ ఇచ్చి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. ఆ గదిలో ఉండే మరో ముగ్గురు బాలికలనూ కాలేజీ నుంచి తొలగించి తల్లిదండ్రులకు అప్పగించినట్లు ప్రిన్సిపల్ తెలిపారు. Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/37VAToX
No comments:
Post a Comment