
జిల్లా కేంద్రం గోడారిగుంటలో ఈ నెల 20వ తేదీన జరిగిన లారీడ్రైవర్ నక్కా బ్రహ్మానందం హత్యకేసును పోలీసులు ఛేదించారు. తన అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని కట్టుకున్న భార్యే ప్రియుడి సాయంతో హత్య చేయించినట్లు తేల్చారు. నిందితులిద్దరినీ పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. Also Read: అల్లవరం మండలం డి.రావులపాలేనికి చెందిన ఈతకోట సూర్యప్రకాష్ పోలీసు ఉద్యోగం సాధించేందుకు ట్రైనింగ్ కోసం కొంతకాలం క్రితం కాకినాడ వచ్చాడు. కొద్దిరోజుల తర్వాత ట్రైనింగ్ మానేసి కాకినాడ 47వ డివిజన్‌లో శానిటరీ సూపర్‌వైజరుగా ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో చేరి పనిచేస్తున్నాడు. బ్రహ్మానందం భార్య మంగలక్ష్మి పారిశుద్ధ్య కార్మికురాలిగా అక్కడే పనిచేస్తుండటంతో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి అక్రమ సంబంధానికి దారితీసింది. Also Read: ప్రియురాలితో గడిపేందుకు గోడారిగుంట దుర్గానగర్‌లో మంగలక్ష్మి కుటుంబం ఉంటున్న పక్క పోర్షన్‌లోనే సూర్యప్రకాష్ అద్దెకు దిగాడు. ఓ రోజు వారిద్దరు సన్నిహితంగా ఉండటం చూసిన బ్రహ్మానందం వారిద్దరిని హెచ్చరించాడు. దీంతో తన సుఖానికి అడ్డొస్తున్న భర్తను చంపేయాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. ప్లాన్ ప్రకారం ఈ నెల 20వ తేదీ రాత్రి మంగలక్ష్మి తన ఇంటి తలుపులు తెరచి ఉంచగా సూర్యప్రకాష్ లోనికి ప్రవేశించి నిద్రిస్తున్న బ్రహ్మానందాన్ని కత్తితో విచక్షణ రహితంగా పొడిచి చంపేశాడు. అనంతరం ఆయుధంతో బైక్‌పై పారిపోయాడు. విచారణలో భాగంగా పోలీసులకు మంగలక్ష్మి ప్రవర్తనపై అనుమానం రావడంతో ఆమెను ప్రశ్నించగా నేరం ఒప్పుకుంది. Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2VqrSS6
No comments:
Post a Comment