Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Monday, 3 August 2020

ఈ లగ్జరీ విమానం మోదీదేనా.. కాంగ్రెస్ నేత షేర్‌చేసిన ఫోటో వెనుక అసలు కథ ఇదీ

మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే జీతూ పట్వారీ విలాసవంతమైన ఓ విమానం ఫోటోను షేర్ చేస్తూ.. ఇది ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగత విమానం అని పేర్కొన్నారు. ప్రధానిని ఛాయ్ వాలాగా ఎగతాళి చేసిన ఆయన.. మోదీ విలాసవంతమైన జీవితాన్ని ఆస్వాదించగలిగితేనే భారతదేశం సూపర్ పవర్ అవుతుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అయితే, ఆ ఫోటోలోని విమానం ప్రధానిది కాదు. నిజం పట్వారీ షేర్ చేసిన ఫోటోలని విమానం ప్రధాని నరేంద్ర మోదీది కాదు.. ఇది అత్యధికంగా అమ్ముడైన డ్రీమ్‌లైనర్ ప్రైవేట్ జెట్ వెర్షన్. వెరిఫికేషన్ అండ్ మెథడాలజీ రివర్స్-ఇమేజ్ ఉపయోగించి, వ్యాపారంలో భాగంగా బోయింగ్ సంస్థ షేర్ చేసిన ఒక పోస్ట్‌ను గుర్తించారు. ‘బోయింగ్ 787 ప్రైవేట్ జెట్ వెర్షన్ ధర 200 మిలియన్ల డాలర్లకు పైగా ఉంటుంది. ఇది 18 గంటలకుపైగా గాల్లో ఎగురుతుంది. దాని అత్యంత విలాసవంతమైన డిజైన్లను చూడండి’ అంటూ ఆ సంస్థ ప్రకటన ఇచ్చింది. ఈ ఫోటోకు ‘ఇన్‌సైడ్ ఏ బీబీజే 787 డ్రీమ్‌లైనర్- డీర్జెట్, గ్రీన్ పాయింట్ టెక్నాలజీస్ / బోయింగ్ ’క్యాప్షన్ ఉంచారు. ప్రస్తుతం ప్రధాని, రాష్ట్రపతి తమ పర్యటనలకు ‘ఎయిరిండియా ఒన్’గా పిలిచే బోయింగ్ 747 విమానాలను వినియోగిస్తున్నారు. ఎయిర్ ఇండియా పైలట్లు ఈబీ 747 విమానాలను ప్రముఖుల కోసం నడుపుతారు. ఎయిర్ ఇండియా ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ వీటిని నిర్వహిస్తుంది. అంతేకాదు, ప్రముఖుల పర్యటనలు లేని సమయంలో ఈబీ747 విమానాలను దేశీయ వాణిజ్య కార్యకలాపాలకు ఉపయోగిస్తారు. జీతూ పట్వారీ చేసిన ఆరోపణలు తప్పుని నిరూపించడానికి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ విభాగం ట్విట్టర్‌ ఖాతాను పరిశీలించాం. తీర్పు విలాసవంతమైన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం ఫోటోను షేర్ చేసి, ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగత విమానం అంటూ కాంగ్రెస్ నేత జీతు పట్వారీ చేసిన ఆరోపణలు తప్పుడవని నిరూపణ అయ్యింది.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/39QMx7l

No comments:

Post a Comment