Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Monday, 3 August 2020

రెండో భర్త సాయంతో ప్రియుడి మర్డర్.. గుంటూరు వ్యాపారి హత్య కేసులో వీడిన మిస్టరీ

జిల్లాలో సంచలనం సృష్టించిన పురుగు మందుల వ్యాపారి పూర్ణచంద్రరావు(39) హత్య కేసును నల్లపాడు పోలీసులు ఛేదించారు. ప్రియురాలే అతడిని మట్టుబెట్టినట్లు నిర్ధారించారు. సోమవారం పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో గుంటూరు అర్బన్‌ ఎస్పీ ఆర్‌.ఎన్‌.అమ్మిరెడ్డి కేసు వివరాలను వెల్లడించారు. జులై 23న అనంతవరప్పాడు, బొంతపాడు డొంక రోడ్డులోని పంట కాలువలో గోనెసంచిలో కట్టి పడేసిన మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నాడు. మృతుడిని పిడుగురాళ్లకు చెందిన పురుగు మందుల వ్యాపారి మోదుగుల పూర్ణచంద్రరావుది(39)గా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా నిజాలు వెలుగులోకి వచ్చాయి. Also Read: పోలీసుల పిడుగురాళ్ల మండలం గుత్తికొండలో ఓ వ్యక్తి సారా విక్రయించేవాడు. అతని వద్దకు పూర్ణచంద్రరావు తరుచూ వెళ్లొచ్చే క్రమంలో అతడి భార్య నాగూర్‌బీతో అక్రమ సంబంధం ఏర్పడింది. 2002లో ఆమె భర్తను వదిలేసి పిల్లలను తీసుకొని గుంటూరుకు మాకాం మార్చేసింది. 2005లో పూర్ణచంద్రరావుకు వేరే మహిళతో పెళ్లయింది. అయినప్పటికీ నాగూర్‌బీతో అక్రమ సంబంధం కొనసాగిస్తుండేవాడు. ఈ క్రమంలోనే ఆమె 2011లో గుంటూరుకు చెందిన మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆమె ఇంటి వద్దే చీటీ పాటలు వేస్తుండటంతో పూర్ణచంద్రరావు కూడా అందులో సభ్యుడిగా చేరాడు. Also Read: చీటీల నెపంతో అతడు తరుచూ ఆమె ఇంటికి వెళ్లి రాసలీలలు సాగించేవాడు. ఈ విషయం నాగూర్‌బీ రెండో భర్తకు తెలియడంతో ఆమె ద్వారానే పూర్ణచంద్రరావును చంపేయాలనుకున్నాడు. దీనికి సరేనన్న ఆమె రౌడీషీటర్‌ రాజేష్‌, తన కుమారుడు కరిముల్లాతో కలిసి వ్యూహ రచన చేసింది. చీటీ డబ్బులు ఇస్తానని పిలవడంతో పూర్ణచంద్రరావు తన ప్రియురాలి వద్దకు ఉత్సాహంగా బయలుదేరాడు. అక్కడ రాజేష్‌, కరిముల్లాతో కలిసి పూర్ణచంద్రరావు గొంతుకు కేబుల్‌ తీగలు, చున్నీ బిగించి చంపేశారు. అయితే అక్కడే నాగూర్‌బీ మరో కన్నింగ్ ప్లాన్ వేసింది. పోలీసులను తప్పుదారి పట్టించి ఈ కేసులో భర్తను ఇరికించాలనే ఉద్దేశంతో అతడి ఆధార్‌ కార్డు, ఓటర్‌ కార్డు, కరెంట్‌ బిల్లులు, పర్సును పూర్ణచంద్రరావు మృతదేహంతో కలిపి గోనెసంచిలో మూటకట్టి పంట కాలువలో పడేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న నల్లపాడు పోలీసులు చాకచక్యంగా వ్యవహరించడంతో నాగూర్‌బీ అసలు రంగు బయటపడింది. Also Read:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2DgE4OR

No comments:

Post a Comment