
రేపుతోంది. ఇప్పటికీ అక్కడ సీఎం కరోనా బారిన పడగా... తాజాగా మాజీ సీఎంకు సైతం కరోనా పాజిటివ్ అని తేలింది. తాజాగా... ప్రతిపక్ష కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య కూడా హడావుడిగా... బెంగళూరులోని మణిపాల్ హాస్పిటల్‌లో చేరారు. నిజానికి సిద్ధరామయ్య చేరింది కరోనా టెన్షన్‌తో కాదు. ఆయనకు యూరినరీ ఇన్ఫెక్షన్ వచ్చింది. నెల నుంచి ఇంట్లోనే ఉంటూ మందులు వాడుతున్నారు. కానీ అది ఏమాత్రం తగ్గకపోగా... భరించలేనంత నొప్పి వస్తుంటే... తట్టుకోలేక ఆస్పత్రికి వెళ్లి అడ్మిట్ అయ్యారు. Read More: ఐతే... ఇప్పుడు కర్ణాటకలో కరోనా ఎక్కువగా ఉండటంతో... డాక్టర్లు వివిధ టెస్టుల్లో భాగంగా... టెస్ట్ కూడా చేశారు. దాని ఫలితాలు వచ్చాక చూస్తే... ఆయనకు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. రాష్ట్రంలో సీఎంకీ, ప్రతిపక్ష నేతకీ ఇద్దరికీ కరోనా రావడంతో ప్రజల్లో ఆందోళన మరింత పెరిగింది. తనకు కరోనా పాజిటివ్ వచ్చింది స్వయంగా సిద్ధరామయ్య ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు. ముందు జాగ్రత్తగా వైద్యుల సలహా మేరకు ఆసుపత్రిలో చేరానని చెప్పారు. తనను కలిసిన వారు అందరూ కూడా కరోనా పరిక్షలు చేయించుకోవాలన్నారు. అందరూ హోం క్వారంటైన్ కి వెళ్ళాలి అని సిద్ధరామయ్య కోరారు.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3kc6bPJ
No comments:
Post a Comment