
అగ్గి పెట్టె ఇవ్వలేదన్న కోపంతో ఓ టీనేజర్ అరాచకం సృష్టించాడు. బంధువుల యువతిపై దారుణానికి ఒడిగట్టాడు. మద్యం మత్తులో రెచ్చిపోయి ఆమెపై తుపాకీతో జరిపాడు. ఆమె చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతోంది. ఈ అత్యంత దారుణ ఘటన తమిళనాడులో జరిగింది. పంతోప్పు సమీపంలోని మాంగమాప్పురంకి చెందిన టీనేజర్(17) మద్యం మత్తులో బంధువుల ఇంటికి వెళ్లాడు. అగిపెట్టె తెచ్చివ్వాలంటూ యువతి(22)ని అడిగాడు. అందుకు ఆమె నిరాకరించడంతో ఇద్దరి మధ్య తీవ్రవాగ్వాదం జరిగింది. దీంతో రెచ్చిపోయిన యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. అగ్గి పెట్టె ఇవ్వలేదన్న కోపంతో తుపాకీ తెచ్చి యువతిపై కాల్పులు జరిపాడు. బుల్లెట్లు ఆమె చేతులు, కాళ్లలో నుంచి దూసుకెళ్లాయి. తీవ్రంగా గాయపడిన యువతి కృష్ణగిరి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. టీనేజర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. Read Also: Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2RSJOlI
No comments:
Post a Comment