Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Wednesday, 23 September 2020

భర్తని బూడిద చేసి చెరువులో కలిపేసిన భార్య.. ప్రియుడితో కలసి ఘాతుకం

భార్య భర్తని బలితీసుకుంది. తమ రాసలీలలకి అడ్డుగా ఉన్నాడని భావించి ప్రియుడితో కలసి ఏకంగా భర్తని చంపేసింది. అనంతరం శవాన్ని బూడిద చేసి చెరువులో కలిపేసింది. స్థానికంగా సంచలనం రేపింన ఈ అమానుష ఘటన జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నెక్కొండ మండలం గేటుపల్లి తండాకు చెందిన దర్యావత్ సింగ్(40) హన్మకొండ ట్రాఫిక్ హోంగార్డుగా పనిచేస్తున్నాడు. అతనికి మహబూబాబాద్ జిల్లా తాళ్లపూసపల్లెకి చెందిన జ్యోతితో ఆరేళ్ల కిందట వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలున్నారు. నెక్కొండ మండల కేంద్రంలో టైలరింగ్ షాపు నడుపుతున్న జ్యోతికి మండలంలోని అప్పల్‌రావుపేటకి చెందిన సాంబరాజుతో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్తకి తెలియకుండా రహస్యంగా రాసలీలలు సాగించేవారు. ఆ విషయం భర్తకి తెలిసిపోవడంతో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా భర్త దర్యావత్ ఇంటికే పరిమితం కావడంతో భార్య తన ప్రియుడిని కలిసేందుకు వీల్లేకుండా పోయింది. తన రాసలీలలకి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య ఆయన్ని చంపేయాలని నిర్ణయించుకుంది. ప్రియుడితో కలిసి పథకం ప్రకారం కిరాతకంగా చంపేసింది. దర్యావత్ మద్యం తాగి ఉన్న సమయంలో ప్రియుడికి కబురుపంపింది. అతను ఇంటికి చేరుకోగానే ప్రియుడితో కలసి భర్తకి ఉరి వేసి అమానుషంగా అంతమొందించింది. గుట్టుచప్పుడు కాకుండా శవాన్ని ట్రాలీ ఆటోలో వేసుకుని సాంబరాజు తన పొలానికి తీసుకెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మరుసటి రోజు వెళ్లి చూడగా శవం సగమే కాలింది. మళ్లీ మరోసారి శవాన్ని తగలబెట్టి బూడిదను తీసుకెళ్లి చెరువలో కలిపేశాడు. ఆధారాల్లేకుండా ప్రియుడి భర్త శవాన్ని భస్మం చేసేశాడు. Also Read: దర్యావత్ సడెన్‌గా కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన అతని అన్న వీరన్న పోలీసులను ఆశ్రయించడంతో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. విచారణ చేపట్టిన పోలీసులు భార్య ఫోన్ కాల్ డేటాను పరిశీలించారు. ఆమె ఎక్కువగా తన ప్రియుడితో మాట్లాడడం గుర్తించి ఇద్దరినీ అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. పోలీసులు తమ స్టైల్లో విచారించడంతో నిందితులు అసలు నిజలు కక్కేశారు. ప్రియుడితో కలసి భర్తని హత్య చేసినట్లు నిందితురాలు ఒప్పుకున్నట్లు సమాచారం. Read Also:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3kIHgCP

No comments:

Post a Comment