
కన్నతండ్రిని కసాయి కొడుకు కిరాతకంగా చంపేసి సొంత పొలంలో పాతిపెట్టిన అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నెలరోజులుగా తండ్రి కనిపించకపోవడంతో బంధువులు కొడుకుని గట్టిగా నిలదీయడంతో దారుణం వెలుగుచూసింది. తండ్రిని తానే తల్లితో కలసి హత్య చేసినట్లు చెప్పడంతో షాక్‌కి గురయ్యారు. ఈ అత్యంత దారుణ ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. చేవెళ్ల మండలం గుండాలకి చెందిన ఎస్.కిష్టయ్య నెల రోజుల నుంచి కనిపించకుండా పోయాడు. అతని కోసం బంధువులు గాలించినా ప్రయోజనం లేకపోయింది. చివరికి కిష్టయ్య కొడుకుపై అనుమానం వచ్చిన బంధువులు అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో దారుణం బయటపడింది. తానే తల్లితో కలసి తండ్రిని చంపేశానని.. శవాన్ని తమ పొలంలోనే పాతిపెట్టినట్లు అంగీకరించాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3mP8ARS
No comments:
Post a Comment