
జిల్లా నియోజకవర్గంలో దారుణం చోటుచేసుకుంది. దారితప్పిన ఏనుగు పంటపొలాల్లో బీభత్సం సృష్టించింది. వేరుశనగ పొలానికి కాపలాగా ఉన్న తండ్రీకూతుళ్లపై దాడి చేసింది. ఈ దాడిలో కూతురి సోనియా అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె తండ్రి మురుగన్ అక్కడి నుంచి పరిగెత్తి ప్రాణాలు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. మృత్యువాత పడిన సోనియా ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. లాక్‌డౌన్ కారణంగా కళాశాలలు లేకపోవడంతో తండ్రికి సాయంగా ఉండేందుకు పొలానికి వెళ్లి మృత్యువాతపడింది. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. సమాచారం అందుకున్న జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ శంకర్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. యువతి కుటుంభ సభ్యులను పరామర్శించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/361zi3D
No comments:
Post a Comment