Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Wednesday, 23 September 2020

కశ్మీర్‌పై పాక్‌కు వంతపాడిన టర్కీ అధ్యక్షుడు.. దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చిన భారత్

పాకిస్థాన్‌కు వంతపాడుతూ ఐక్యరాజ్యసమితిలో కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించిన టర్కీ అధ్యక్షుడి రీసెప్ తయ్యిప్ ఎర్డోగన్‌కు భారత్ దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చింది. ఇది తమ అంతర్గత వ్యవహారమని, ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించడం నేర్చుకోవాలని ఘాటుగా సూచించింది. అంతేకాదు, మీ దేశంలోని వ్యవహారాలపై దృష్టి సారించాలని హితవు పలికింది. ఐరాస సర్వసభ్య వార్షిక సమావేశాల్లో భాగంగా విర్చువల్ ద్వారా వీడియో సందేశం ఇచ్చిన ఎర్డోగన్.. కశ్మీర్ అంశాన్ని ఐరాస నిబంధనల ప్రకారం పరిష్కరించాలంటూ వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన భారత్.. ఇది తమ అంతర్గత వ్యవహారమని పునరుద్ఘాటించింది. ‘భారత్‌లో అంతర్భాగమనైన జమ్మూ-కశ్మీర్‌ గురించి ప్రస్తావించడాన్ని మేం తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఇది ముమ్మాటికీ భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడమే. దీన్ని మేం ఏమాత్రం సహించబోం.. ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించడం టర్కీ నేర్చుకోవాలి.. సొంత దేశ విధానాలపై దృష్టి సారించాలి’ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి తిరుమూర్తి చురకలంటించారు. ఐరాసలో అవగాహనారాహిత్య వ్యాఖ్యలు చేసిన ఎర్డోగన్... 2019లోనూ కశ్మీర్‌ అంశాన్ని ఇదే వేదికపై ప్రస్తావించి భారత్‌ ఆగ్రహానికి గురయ్యారు. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దుచేసి ఈ వివాదాన్ని భారత్ మరింత సంక్లిష్టం చేసిందని ఎర్డోగన్ వ్యాఖ్యానించారు. ఐరాస నిబంధనల ప్రకారం చర్చల ద్వారా పరిష్కారానికి తాము అనుకూలమని అన్నారు. సిమ్లా ఒప్పందం ప్రకారం.. కశ్మీర్ వివాదాన్ని పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని భావిస్తోంది. కశ్మీర్ విషయంలో పాకిస్థాన్‌కు టర్కీ, మలేషియా మాత్రమే మద్దతు ఇస్తున్నాయి. అంతర్జాతీయ సమాజం మద్దతు కూడగట్టడానికి పాకిస్థాన్ విఫలయత్నం చేస్తోంది. కశ్మీర్ వివాదం పరిష్కారంలో అంతర్జాతీయ సమాజం విఫలమయ్యిందంటూ టర్కీ అధ్యక్షుడు 2019 ఐరాస వార్షిక సమావేశంలో ఆరోపించారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3cpEU98

No comments:

Post a Comment