Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Wednesday, 23 September 2020

Yadadri: రేప్ బాధితురాలికి గర్భం.. పెళ్లి కాకుండా పుట్టిన శిశువుని అమ్మేసి.. భువనగిరిలో దారుణం

కామాంధుల చేతిలో బలైపోయిన అత్యాచార బాధితురాలు అవాంఛిత గర్భం దాల్చింది. నెలలు నిండి ఆస్పత్రిలో శిశువును ప్రసవించింది. పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనిచ్చిన యువతి పది రోజులకే పేగు బంధాన్ని తెంచుకుంది. పెళ్లికాని కూతురికి పుట్టిన బిడ్డని యువతి తల్లిదండ్రులు నిలువునా అమ్మేశారు. అత్యాచారం కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులకి విచారణలో షాకింగ్ విషయం తెలియడంతో బాధితురాలి తల్లిదండ్రులపై కేసు నమోదు చేశారు. ఈ దారుణ ఘటన జిల్లాలో జరిగింది. హైదరాబాద్‌లోని నేరేడ్‌మెట్‌కి చెందిన యువతి అత్యాచారానికి గురైంది. కామాంధుడు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అప్పట్లో అతనిపై అత్యాచారం కేసు నమోదైంది. అయితే రేపిస్టు చేతిలో బలైన యువతి గర్భం దాల్చింది. దీంతో ఆమె తల్లిదండ్రులు యువతిని భువనగిరికి తీసుకెళ్లారు. ఈ నెల 12 వతేదీన యువతి భువనగిరి ఏరియా ఆస్పత్రిలో బిడ్డకు జన్మనిచ్చింది. పెళ్లి కాని కూతురికి పుట్టిన బిడ్డని అవమానంగా భావించిన ఆమె తల్లిదండ్రులు పది రోజులకే పేగుబంధాన్ని తెంచేశారు. Also Read: పసికందుని ఘట్‌కేసర్‌ మండలం ఏదులాబాద్‌కి చెందిన దంపతులకు రూ.60 వేలకు విక్రయించారు. తెలిసిన వ్యక్తుల ద్వారా భువనగిరి శివారులోని ఎల్లమ్మ గుడి వద్ద బిడ్డను వారికి అప్పగించారు. అయితే అత్యాచారం కేసు దర్యాప్తు చేస్తున్న నేరేడ్‌మెట్ పోలీసులు డీఎన్‌ఏ పరీక్షల కోసం పాపను తేవాలని అడగడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. పాప పురిట్లోనే చనిపోయిందంటూ బుకాయించే ప్రయత్నం చేశారు. అనుమానం వచ్చిన పోలీసులు విచారణ జరపడంతో బిడ్డను అమ్మేసిన విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు వెంటనే పాపను చైల్డ్ కేర్ సెంటర్‌కి తరలించారు. పసికందుని విక్రయించినందుకు యువతి తల్లిదండ్రులపై కేసు నమోదు చేశారు. Read Also:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/32UTEKc

No comments:

Post a Comment