Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Thursday, 29 October 2020

వేగంగా హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్.. త్వరలో కీలక పరిణామం

హైదరాబాద్-పుణె-ముంబయి బుల్లెట్ ట్రైన్ కారిడార్‌కు వేగంగా అడుగులు పడుతున్నాయి. మొత్తం 711 కిలోమీటర్ల పనులకు కేంద్ర ప్రభుత్వం నవంబర్‌లోనే టెండర్లను పిలవనుంది. వచ్చే ఏడాది నుంచే పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. బుల్లెట్ ట్రైన్‌తో ప్రయాణ సమయం తగ్గడమే కాకుండా వాణిజ్య పరంగానూ ఎంతో సౌలభ్యంగా ఈ కారిడార్ ఉండనుంది. ఈ మార్గంలో ప్రస్తుతం ఉన్న రైల్వే ట్రాక్‌లపై 80 నుంచి గరిష్ఠంగా 160 కిలోమీటర్ల వేగంతో మాత్రమే రైళ్లు ప్రయాణించగలవు. అంతకన్నా వేగంగా వెళ్తే ఈ ట్రాక్‌లు తట్టుకోలేవు. కాబట్టి బుల్లెట్ ట్రైన్స్ కోసం కొత్త ట్రాక్‌లు వేయాల్సి ఉంటుంది. దీనికోసం ఇప్పుడు టెండర్ల ప్రక్రియ మొదలు కానుంది. దేశం మొత్తం 7 మార్గాల్లో బుల్లెట్ రైలు కారిడార్లను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో ముంబయి-హైదరాబాద్ మార్గం ఒకటి. ఈ రూట్‌తో పాటు మరికొన్ని రూట్ల నిర్మాణం కోసం నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ సన్నాహాలు మొదలు పెట్టింది. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)పై చర్చించేందుకు నవంబర్ 5న ప్రీ బిడ్ సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ మీటింగ్‌లో కారిడార్‌పై సర్వేతో పాటు అండర్గ్రౌండ్ వసతులు, సబ్స్టేషన్లకు కరెంట్ సరఫరా వంటి విషయాలన్నీ చర్చకు రానున్నాయి. నవంబర్ 11న టెండర్లను పిలవనున్నారు. 18న టెండర్లను పరిశీలించనున్నారు. వచ్చే ఏడాది పనులను ప్రారంభించి మూడు నాలుగేళ్లలో బుల్లెట్ ట్రైన్ కారిడార్ పనులను పూర్తి చేసేందుకు కసరత్తులు చేస్తున్నారు. ప్రస్తుతం అహ్మదాబాద్-ముంబయి మార్గంలో బుల్లెట్ రైలు కారిడార్ పనులు నడుస్తున్నాయి.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3jGIPjU

No comments:

Post a Comment