Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Tuesday, 1 December 2020

భారత్‌లో మారణహోమం సృష్టించాం.. మెడల్స్ ఇవ్వండి: పాక్‌ను కోరిన 26/11 సూత్రధారి

26/11 ముంబయి ఉగ్రదాడుల సూత్రధారులలో ఒకరైన పాక్ సంతతికి చెందిన కెనడా వ్యాపారి తహవుర్ రానా ప్రస్తుతం అమెరికా పోలీసుల అదుపులో ఉన్నాడు. అతడిపై దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. భారత్‌లో మారణ హోమానికి పాల్పడినందుకు తనకు అత్యున్నత పౌర పురస్కారం ఇవ్వాలని పాకిస్థాన్ ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిపారు. అంతేకాదు, ఇందులో పాల్గొన్న తొమ్మిది మంది ఉగ్రవాదులకు అత్యున్నత సైనిక పురస్కారాలను ఇవ్వాలని డిమాండ్ చేశాడు. Read Also: భారత్ ఇచ్చిన ఆధారాలతో తహపూర్ రానాను లాస్ ఏంజెల్స్ పోలీసులు జూన్ 10న అరెస్ట్ చేశారు. ఇటీవల కోర్టుకు సమర్పించిన ఛార్జిషీట్‌లోని వివరాలను అటార్నీ నికోలా టీ హన్నా వివరించారు. ముంబయి దాడుల్లో రానా హస్తమున్నట్లు ధ్రువీకరించిన హన్నా.. అతడిని తమకు అప్పగించాలన్న భారత అభ్యర్థనను సమర్థించారు. ‘రానా సహా డేవిడ్ హెడ్లీ, లష్కరే తొయిబాకు చెందిన మరికొందరు ముష్కరులు కలిసి చేసిన కుట్ర 2008 నవంబరు 26న ముంబయిలో దాడులకు దారితీసింది. నవంబరు 26 లేదా 29న దాడికి పథకం వేశారు.. పాకిస్థాన్‌లోని తాను చదువుకున్న పాఠశాలపై 1971లో జరిగిన దాడి గురించి కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. Read Also: ఉగ్రదాడి తర్వాత కూడా హెడ్లీ, రానా మధ్య సంప్రదింపులు జరిగాయి.. దాడి జరిగిన ప్రదేశాల్ని వీడియో తీయడం.. డిసెంబరులో ఆయా ప్రాంతాల్లో పరిస్థితిని రానాకు హెడ్లీ వివరించాడు.. ఇరువురి మధ్య ఇలా పలుసార్లు సంభాషణలు కొనసాగాయి. ఈ క్రమంలో వీరి సంభాషణల్ని అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ ఛేదించింది. దాడుల్లో హతమైన 9 మంది ఉగ్రవాదులకు పాకిస్థాన్ అత్యున్నత సైనిక పురస్కారం.. తనకు దేశ అత్యున్న పౌర పురస్కారాల్లో ఒకటి ఇవ్వాలని రానా డిమాండ్‌ చేసిన విషయాన్ని ఎఫ్‌బీఐ స్పష్టంగా వింది. ఈ విషయం గురించి పాక్‌లోని తమ సభ్యులకు తెలియజేసినట్లు హెడ్లే చెప్పడంతో రానా చాలా సంతోషించాడు’ అని హన్నా తెలిపారు. Read Also: ముంబయి దాడుల తర్వాత కూడా కుట్రలు సాగినట్లు హన్నా వెల్లడించారు. 2009లోనూ భారత్‌లో దాడికి ప్రయత్నించి విఫలమయ్యారని తెలిపారు. ఇందుకు హెడ్లీ రెక్కీ నిర్వహించాడని, డెన్మార్క్‌లోనూ దాడులకు ప్రయత్నించినట్టు తెలియజేశారు. ముంబయి దాడుల తర్వాత 2009 అక్టోబర్‌ 3న హెడ్లీని షికాగో అరెస్ట్ చేయగా.. ఆరునెలల తర్వాత నేరాల్ని అంగీకరించాడు. సుదీర్ఘ విచారణ అనంతరం ఇల్లినాయిస్‌ కోర్టు అతడికి 35 ఏళ్ల జైలు శిక్ష విధించింది. Read Also: తన వ్యాపారాలను వినియోగించుకుని హెడ్లీ వివిధ దేశాలకు సులువుగా ప్రయాణించినట్లు హన్నా బయటపెట్డాడు. పాల వ్యాపారం నెపంతో సెప్టెంబరు 2006లో భారత్‌లోకి అడుగుపెట్టిన హెడ్లీ.. పలుసార్లు తన వీసాను పొడిగించుకున్నాడు. తాజ్‌ హోటల్‌ సహా పలు ప్రాంతాల్ని స్పష్టంగా వీడియో తీసి, వాటిని పాక్‌ ఉగ్రవాదులకు అందజేశాడు. వారి సూచనలతో 2007 ఫిబ్రవరిలో భారత్‌కు వచ్చి మరోసారి ఆయా ప్రాంతాలపై గట్టి నిఘా వేశాడు. ఈ మేరకు పూర్తి వివరాలను ఛార్జిషీట్‌లో హన్నా విపులీకరించారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/37rexgK

No comments:

Post a Comment