Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Tuesday, 1 December 2020

ఎందుకు కొట్టావని అడిగితే చంపేశాడు.! తిరుపతిలో ఘోరం

మద్యం మత్తులో జరిగిన గొడవ చినికి చినికి గాలివానగా మారి యువకుడి ప్రాణాలు పొట్టనబెట్టుకుంది. గొడవతో ఏ సంబంధం లేని యువకుడు అకారణంగా దారుణ హత్యకు గురయ్యాడు. నన్ను కొట్టావని అన్నకి చెప్తానన్నందుకు అతని ఇంటికే వెళ్లి కొట్టొచ్చాడో పోకిరీ. ఆ అవమానం భరించలేక బాధపడుతున్న కొడుకుని వెంటబెట్టుకెళ్లి ఎందుకు కొట్టావని తండ్రి నిలదీయడంతో ఆయన కళ్లెదుటే చంపేశాడు. ఈ దారుణ ఘటన చిత్తూరు జిల్లా తిరుపతిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు మేరకు.. నగరంలోని లక్ష్మీపురానికి చెందిన శంకర్(21) తన స్నేహితుడు గణేష్‌తో కలసి స్థానిక సాయిబాబా ఆలయం సమీపంలో మద్యం తాగాడు. అనంతరం తిరుచానూరుకి చెందిన పవన్ అనే యువకుడిని పిలిపించి అతనితో గొడవపడి చేయిచేసుకున్నాడు. దీంతో ఆగ్రహం చెందిన పవన్.. అదే ఏరియాకి చెందిన భరత్ యాదవ్‌(19)కి చెప్పి నీ సంగతి చెప్తానంటూ హెచ్చరించాడు. మద్యం మత్తులో ఉన్న శంకర్ మరింత రెచ్చిపోయాడు. భరత్ నా సంగతి తేల్చేదేంటి? నేను వాడి సంగతి చూస్తానంటూ నేరుగా భరత్ యాదవ్ ఇంటకెళ్లి బయటికి పిలిచాడు. ఇంటి దగ్గరే అతనితో గొడవపడి కొట్టాడు. శంకర్ తనను ఇంటికొచ్చి కొట్టడాన్ని తట్టుకోలేకపోయిన భరత్.. భోజనం కూడా చేయకుండా మౌనంగా కుమిలిపోయాడు. అది గమనించిన భరత్ తండ్రి రాజా నెమ్మదిగా విషయం తెలుసుకుని కొడుకుని వెంటబెట్టుకుని శంకర్ ఇంటికెళ్లాడు. తన కొడుకును ఎందుకు కొట్టావంటూ నిలదీశాడు. Also Read: ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరగడంతో శంకర్‌పై భరత్ తండ్రి రాజా చేయిచేసుకున్నాడు. ఆగ్రహంతో రగిలిపోయిన శంకర్ కత్తి తీసుకుని పక్కనే ఉన్న భరత్ పొట్టలో పొడిచి పరారయ్యాడు. కన్నతండ్రి కళ్లెదుటే కొడుకుని పొడిచేశాడు. వెంటనే భరత్‌ని రుయా ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు భరత్ యాదవ్ తిరుపతి టీడీపీ నేత నరసింహ యాదవ్‌కి సమీప బంధువు కావడంతో స్థానికంగా కలకలం రేపింది. తమపార్టీ కార్యకర్తను హత్య చేశారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తుంటే.. మద్యం మత్తులో జరిగిన గొడవ కారణంగా చనిపోయాడని పోలీసులు పేర్కొనడం గమనార్హం. Read Also:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3mqffBp

No comments:

Post a Comment