Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Monday, 7 December 2020

కొత్తగా పెళ్లి, కరోనా భయంతో దగ్గరకు రాని భర్త.. 3 నెలలైనా అలాగే, భార్య షాకింగ్ ట్విస్ట్!

రోనా వైరస్ ఒక్కొక్కరి జీవితాలతో ఒక్కోలా ఆడుకుంటోంది. కొంత మంది జీవితాల్లో అనూహ్య సంఘటనలు జరుగుతున్నాయి. అలాంటిదే ఒకటి మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో చోటు చేసుకుంది. కొత్తగా పెళ్లయిన ఓ యువకుడు కరోనా వైరస్‌ సోకుతుందనే భయంతో తన భార్య దగ్గరికి వెళ్లేందుకు కూడా భయపడ్డాడు. మూడు నెలల పాటు భార్యకు దూరంగా ఉన్నాడు. భర్త పడక గదికి రావడానికి ఆసక్తి చూపకపోవడంతో నవ వధువు అతడిని అపార్థం చేసుకుంది. అతడికి షాకింగ్ ట్విస్టు ఇచ్చింది. భోపాల్‌కు చెందిన ఓ యువకుడికి ఓ యువతితో జూన్‌ 29న వివాహమైంది. అప్పటికి దేశంలో కరోనా వైరస్ పంజా విసురుతోంది. మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పదే పదే హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో ఆ యువకుడిలో ఒక రకమైన కరోనా ఫోబియా ఆవరించింది. కరోనా నిబంధనల మేరకే పెళ్లి జరిపించినా.. అతడిలో భయం పట్టుకుంది. పెళ్లి పీటల మీద నుంచి మొదలు తన ఇంటికి వచ్చిన తర్వాత కూడా అమ్మాయితో భౌతిక దూరం పాటించాడు. కరోనా సోకుతుందనే భయంతో ఆ యువకుడు తన భార్య దగ్గరికి వెళ్లేందుకు కూడా జంకాడు. ఆ అమ్మాయి మూడు నెలల పాటు అత్తవారింట్లో ఉంది. ఫోన్లో చక్కగా మాట్లాడుతున్న ఆ వ్యక్తి పడక గదికి మాత్రం రావట్లేదు. దీంతో ఆమెలో అనుమానం మొదలైంది. చివరికి తీవ్ర నిరాశకు గురై పుట్టింటికి వెళ్లిపోయింది. రెండు నెలల పాటు పుట్టింట్లోనే ఉండిపోయింది. అయినా.. ఆ యువకుడి తన భార్య వద్దకు వచ్చేందుకు ఆసక్తి చూపలేదు. పుట్టింటి వారు ఏం జరిగిందని గుచ్చి గుచ్చి అడగడంతో ఆమె ఓపెన్ అయ్యింది. తన భర్త సంసారానికి పనికి రాడనీ చెప్పి బోరుమంది. ఆ తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి తనకు భరణం ఇప్పించాలని కోర్టు మెట్లెక్కింది. పెళ్లయిన ఐదు నెలల్లో అత్తామామలు తనను తీవ్రంగా వేధించారని ఆ యువతి ఆరోపించింది. తన భర్త ఫోన్‌లో బాగా మాట్లాడేవాడని, దగ్గరకు మాత్రం రాలేదని వాపోయింది. ఈ మేరకు డిసెంబర్‌ 2న భోపాల్‌ లా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. న్యాయాధికారుల ఆ యువకుడిని, అతడి కుటుంబసభ్యులను కౌన్సెలింగ్‌లో పిలిపించారు. అక్కడ అసలు విషయం తెలిశాక అవాక్కయ్యారు. కరోనా ఫోబియా కారణంగానే ఆ యువకుడు దాంపత్య విధిని నెరవేర్చలేదని తేల్చారు. యువకుడికి వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. అంతా సరిగ్గానే ఉందని ధ్రువీకరించిన తర్వాత యువతికి కూడా కౌన్సెలింగ్‌ ఇచ్చి భర్తతో పాటు పంపించారు. ప్రస్తుతం ఆ యువతి తన అత్తవారింట్లో ఉందని, ఏ ఇబ్బంది లేదని భోపాల్‌ జిల్లా లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ కార్యదర్శి సందీప్‌ శర్మ తెలిపారు. కరోనా సంక్షోభ కాలంలో చోటు చేసుకున్న వింత ఘటనల్లో ఇదొకటిగా నిలిచింది. Also Read: Video: Don't Miss: Video: పీపీఈ కిట్లు ధరించి పెళ్లి.. అమ్మాయికి కరోనా సోకడంతో ఇలా ఏర్పాటు


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2IpI9Tx

No comments:

Post a Comment