Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Monday, 7 December 2020

భారత్ బంద్.. పార్టీల జెండాలు పక్కనబెట్టి రైతు జెండాతోనే ఆందోళన

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలనే డిమాండ్‌తో దేశవ్యాప్తంగా రైతు సంఘాలు మంగళవారం భారత్‌ బంద్‌ నిర్వహిస్తున్నాయి. ఈ బంద్‌కు దేశవ్యాప్తంగా 25 రాజకీయ పార్టీలతోపాటు వివిధ ఉద్యోగ, కార్మిక సంఘాలు తమ మద్దతు ప్రకటించాయి. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులు, కేంద్రం మధ్య అయిదుసార్లు చర్చలు జరిగినా ఎటువంటి పరిష్కారం తేలకపోవడంతో భారతత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఆరో విడత చర్చలకు ఒకరోజు ముందు ఈ భారీ ఆందోళన కార్యక్రమాన్ని తలపెట్టాయి. రాజకీయ పార్టీలు బంద్‌కు మద్దతిచ్చినప్పటికీ పార్టీ జెండాలు, అజెండాలను పక్కనబెట్టి తమకు ప్రతిబింబమైన ఆకుపచ్చ జెండాలతోనే రావాలని రైతు సంఘాల నేతలు పిలుపునిచ్చారు. ఎక్కడా ఎటువంటి గొడవలు లేకుండా శాంతియుతంగా బంద్ నిర్వహించాలని రైతులు కోరారు. కార్మిక, ఉద్యోగ, వ్యాపార సంఘాలు బంద్‌కు మద్దతివ్వడంతో ఎవరినీ బలవంతం చేయకుండా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొనేలా ప్రోత్సహించాలని కోరారు. విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా తాము ఉంటున్న చోట్లే నిరసనలు వ్యక్తం చేస్తూ బంద్‌కు మద్దతిస్తున్నందున ఈ ఆందోళన అంతర్జాతీయ రూపు సంతరించుకుంది. రోజంతా బందు పాటిస్తామని, ఉదయం 11 గంటల నుంచి రహదారుల దిగ్బంధం వంటి నిరసనలు మధ్యాహ్నం 3 గంటల వరకే ఉంటాయని ప్రకటించారు. నవంబరు 27 నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన నిర్వహిస్తున్నా తాము ఇంతవరకూ ఏ రాజకీయపార్టీ నుంచి విరాళాలు, మద్దతు తీసుకోలేదని రైతులు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, రైతులు చేపట్టిన భారత్ బంద్‌కు మొత్తం 11 రాష్ట్రాలు మద్దతు ప్రకటించాయి. పంజాబ్, ఢిల్లీ, రాజస్థాన్, పశ్చిమ్ బెంగాల్, కేరళ, ఝార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, పుదుచ్చేరి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు తెలిపాయి. డీఎంకే, ఎన్‌సీపీ, ఎస్పీ, ఆర్జేడీ, లెఫ్ట్ పార్టీలు, శివసేన, అకాళీదల్ తదితర పార్టీలు మద్దతు తెలిపాయి. అయితే, రాజకీయ పార్టీల నేతలు ఎవ్వర్నీ వేదికపైకి అనుమతించబోమని రైతు సంఘాలు స్పష్టం చేశాయి.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/36RCb78

No comments:

Post a Comment