Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Monday, 7 December 2020

రజినీ రాజకీయ సలహాదారుపై స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు

తన రాజకీయ అరంగేట్రంపై తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ స్పష్టతనిచ్చిన విషయం తెలిసిందే. ఇందుకు సన్నాహాలు జరుగుతుండగా డిసెంబరు చివరి లేదా జనవరి తొలివారంలో రాజకీయ పార్టీపై రజినీ ప్రకటన చేయనున్నారు. తాజాగా, తలైవా రాజకీయ ప్రవేశంపై డీఎంకే చీఫ్ స్పందించారు. రాజకీయాల్లోకి ఎవరైనా రావొచ్చని, అయితే రజనీకాంత్ పార్టీ పెట్టిన తర్వాత దీనిపై పూర్తిస్థాయిలో మాట్లాడతానని వ్యాఖ్యానించారు. రజనీకాంత్‌ను పార్టీ ప్రకటించి, ఆయన సిద్ధాంతాలు, విధానాలు తెలుసుకుని అప్పుడు స్పందిస్తాను అంటూ వివరించారు. అయితే, రజినీ రాజకీయ సలహాదారుపై మాత్రం స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ సలహాదారుగా తమిళరువి మణియన్‌ను నియమించుకోవడంపై రజనీకాంత్ చింతిస్తున్నట్టు తెలిసిందని వ్యాఖ్యానించారు. తమిళరువిని ఎందుకు తెచ్చిపెట్టుకున్నానా అని రజనీకాంత్ పునరాలోచనలో పడ్డారని అన్నారు. రాజకీయ పార్టీ ఏర్పాటు, ఇతర కార్యాచరణ కోసం తమిళరువి మణియన్‌ను రజనీకాంత్ నియమించిన విషయం తెలిసిందే. రాజకీయ పార్టీ ఏర్పాటు క్రమంలో తలైవా ప్రకటించిన మొట్టమొదటి నియామకం ఇదే. తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో మొత్తం 234 స్థానాల్లోనూ రజినీ పార్టీ పోటీచేస్తుందని తమిళరువి శనివారం ప్రకటించారు. ప్రస్తుత రాజకీయాలకు భిన్నంగా తాము ఆధ్యాత్మికతతో కూడిన రాజకీయాలు చేస్తామని, ఎవ్వరినీ విమర్శించబోమని తమిళరువి పేర్కొన్నారు. ఇక, 2017లో రాజకీయాల్లో వస్తున్నట్టు రజినీకాంత్ ప్రకటించారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత, డీఎంకే నేత, మాజీ సీఎం కరుణానిధి మరణంతో తమిళ రాజకీయాల్లో ఏర్పడిన శూన్యతను రజినీ భర్తీచేస్తారని భావించారు. కానీ, మూడేళ్ల దాటినా రజినీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. తాజాగా, తన రాజకీయ ప్రవేశంపై ప్రకటన చేశారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/37JBVpV

No comments:

Post a Comment