Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Monday, 7 December 2020

వ్యవసాయ చట్టాల్లో ఏముంది? రైతులు ఎందుకు పోరాటం చేస్తున్నారు?

కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు కొన్ని రోజులుగా పోరాటం చేస్తున్నారు. ముఖ్యంగా పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన రైతులు తీవ్ర ఆందోళన చేస్తున్నారు. ఢిల్లీ శివార్లలో రహదారులను దిగ్బంధం చేశారు. కొన్ని రోజులుగా రోడ్లపైనే తిష్ట వేశారు. అక్కడే తిండి, అక్కడే నిద్ర. కొంత మంది తమ కుటుంబాలతో పాటు తరలివచ్చి ఈ ఆందోళనల్లో పాల్గొంటున్నారు. నిరసన తెలుపుతున్న వారిలో చిన్నారులు, మహిళలు, వృద్ధులు కూడా ఉన్నారు. కొత్త చట్టాలు రైతులకు మేలు చేస్తాయని ప్రధాని నరేంద్రం మోదీ చెబుతున్నారు. ఈ చట్టాలతో రైతుల ఆదాయం పెరిగి ఆర్థికంగా బలపడతారని హామీ ఇస్తున్నారు. అన్నదాతలకు ఎలాంటి హాని జరగదని భరోసా ఇస్తున్నారు. అయినా.. రైతులు తమ ఆందోళన విరమించడం లేదు. రైతులతో కేంద్ర ప్రభుత్వం జరిపిన చర్చల్లో ఎలాంటి పురోగతి లేదు. తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తూ డిసెంబర్ 8న భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. కొత్త చట్టాలతో కార్పొరేట్లకే లాభమని, తమకు ఒరిగేదేమీ లేదని రైతులు వాపోతున్నాయి. 3 వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకునే వరకు ఆందోళన కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో అసలు ఆ వ్యవసాయ చట్టాల్లో ఏముంది? రైతులు ఎందుకు ఆందోళన చేస్తున్నారు? అన్నదాతలు చెబుతున్న అభ్యంతరాలేమిటీ? తదితర అంశాల గురించి సంక్షిప్తంగా.. 1) రైతుల (సాధికారత, రక్షణ) ధరల హామీ, సేవల ఒప్పంద చట్టం: ఏ పంటలకైనా.. రైతులు తమ ఉత్పత్తులకు సంబంధించి కొనుగోలుదారుతో ఒప్పందం కుదుర్చుకోవచ్చు. దీనికి కాల పరిమితి కనీసం ఒక పంట కాలం నుంచి గరిష్టంగా ఐదేళ్ల వరకు ఉంటుంది. రైతులు పంట వేయడానికి ముందే కొనుగోలుదారులతో ఒప్పందం చేసుకోవచ్చు. వివాదాల పరిష్కారానికి మూడంచెల వ్యవస్థ ఉంటుంది. ప్రభుత్వం ఏం చెబుతోంది? ☆ పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు రైతులతో ఒప్పందాలు చేసుకోవడానికి ముందుకొస్తాయి. దీంతో తమ పంట ఉత్పత్తుల అమ్మకాల విషయంలో రైతులకు భరోసా కలుగుతుంది. ☆ ముందే ధర తెలుసుకోవడం వల్ల రైతు తన పెట్టుబడిని నియంత్రణలో ఉంచుకోవచ్చు. ☆ రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు లభిస్తాయి. ☆ అమ్మకాల ప్రక్రియలో ఉండే ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. రైతుల అభ్యంతరాలేమిటి? ★ ఈ చట్టం ద్వారా ఒప్పంద సేద్యం బలపడే ప్రమాదం ఉంది. కార్పొరేట్ కంపెనీలు ప్రపంచవ్యాప్త డిమాండ్‌కు అనుగుణంగా పంటల సాగు చేయాలని రైతులపై ఒత్తిడి తీసుకొస్తాయి. అదే జరిగితే దేశంలో పంటల వైవిధ్యం దెబ్బతింటుంది. ★ ఇప్పటికే పత్తి, సోయా లాంటి పంటలు కార్పొరేట్ సంస్థల గుత్తాధిపత్యంలోకి వెళ్లిపోయాయి. ★ రసాయనాలు, యంత్రాలు, శుద్ధి, కమొడిటీ ట్రేడింగ్, సూపర్ మార్కెట్ల నిర్వహణను బడా సంస్థలే నిర్వహిస్తున్నాయి. వీటిని జవాబుదారీ చేయడం కష్టం. ★ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో బహుళజాతి సంస్థలే లాభపడ్డాయి. ఆయా ప్రాంతాల్లో, దేశాల్లో డిమాండ్‌లో హెచ్చుతగ్గులను ఆసరాగా చేసుకొని బడా కంపెనీలు ఉత్పత్తులను పెద్ద ఎత్తున నిల్వ చేస్తున్న దాఖలాలు ఉన్నాయి. 2) నిత్యావసర సరకుల (సవరణ) చట్టం: నిత్యావసరాల జాబితాలో ఉన్న వస్తువుల ఉత్పత్తి, సరఫరా, పంపిణీ, అమ్మకాల నియంత్రణ అధికారం కేంద్రానికి ఉంటుంది. ప్రభుత్వం ఏం చెబుతోంది? ☆ వినియోగదారుల ప్రయోజనాలను రక్షిస్తూనే నిత్యావసరాలపై నియంత్రణ వ్యవస్థను సరళీకరిస్తాం. ☆ వ్యవసాయ రంగంలో పోటీ ఏర్పడుతుంది. తద్వారా రైతుల ఆదాయం పెరుగుతుంది. ☆ పంట ఉత్పత్తులను నిల్వ చేసుకోవడానికి సదుపాయాలు పెరుగుతాయి. తద్వారా పంట వ్యర్థాలు పెద్ద మొత్తంలో తగ్గుతాయి. రైతుల అభ్యంతరాలు: ★ దళారులు, వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించే ప్రమాదం ఉంది. ★ ఇటీవల ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించిన సందర్భంలో ఇదే జరిగిందని, తాము తీవ్రంగా నష్టపోయామని రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. Must Read: Don't Miss: Also Read:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3mX6yio

No comments:

Post a Comment