Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Monday, 7 December 2020

టీకా వచ్చేస్తుందని సంబరపడొద్దు.. వచ్చే ఏడాది మరింత దారుణ పరిస్థితి: డబ్ల్యూఎఫ్‌పీ హెచ్చరిక

దాదాపు ఏడాది కాలంగా ప్రపంచానికి కంటిమీద కునుకే కరవయ్యింది. కరోనా మహమ్మారి నుంచి ఎప్పుడు విముక్తి లభిస్తుందా అంటూ భారంగా రోజులు వెళ్లదీస్తోంది. అయితే, వ్యాక్సిన్‌పై ప్రపంచం పెట్టుకున్న ఆశలు ఫలించడంతో మహమ్మారి గురించి అంతం గురించి కలలు కనొచ్చని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ సైతం వ్యాఖ్యానించారు. దీంతో కరోనా ముగింపు దశకు చేరుకుందనే అభిప్రాయం వ్యక్తం మవుతోంది. వచ్చే ఏడాది వ్యాక్సిన్‌ వస్తుందని, దీంతో ప్రపంచంలో సాధారణ పరిస్థితులు నెలకుంటాయని జనం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే, ఈ అశలు నీరుగారిపోయేలా కొత్త ఏడాదిలో పరిస్థితులు మరింత దారుణంగా ఉంటాయని ప్రపంచ ఆహార ప్రోగ్రామ్ () హెచ్చరించింది. మరో విపత్తునకు ప్రజలు తమను తాము సిద్ధం చేసుకోవాలని డబ్ల్యూఎఫ్సీ చీఫ్ డేవిడ్ బీస్లీ కోరారు. రాబోయే 2021 ఈ శతాబ్దంలో ప్రజలు చూసిన అత్యంత చెత్త సంవత్సరాల్లో ఒకటిగా నిలుస్తుందని అంచనా వేసిన ఆయన.. తీవ్రమైన కరవు, ఆకలి సమస్యలు ప్రపంచాన్ని పట్టిపీడించనున్నామని వ్యాఖ్యానించారు. పేద దేశాల్లో ఈ ప్రభావం చాలా అధికంగా ఉంటుందని హెచ్చరించారు. కరోనా వైరస్‌పై ఐక్యరాజ్య సమితి నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో డేవిడ్ బేస్లీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రపంచంలోని 27 కోట్ల మంది ఆకలివైపు పయనిస్తున్నారని, 2021లో తీవ్రమైన కరవు పీడించనుందని అన్నారు. ఇదే సమయంలో కరోనా సంక్షోభం సైతం కొనసాగుతుందని, అందరికీ వ్యాక్సిన్ సరఫరాకు చాలాకాలం పట్టడమే ఇందుకు కారణమని వ్యాఖ్యానించారు. ఈ ఏడాది కరోనా నివారణకు 19 ట్రిలియన్ డాలర్ల వరకూ ఖర్చయిందని... ఫలితం 2021లోనూ దక్కే అవకాశాలు లేవని, ప్రపంచ వ్యవస్థ మరో మెట్టు దిగజారనుందని బిస్లీ హెచ్చరించారు. యెమెన్, దక్షిణ సూడాన్, సిరియా వంటి దేశాలను భయంకరంగా మార్చనుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థను, ప్రభుత్వ పరిస్థితిని టైటానిక్ షిప్ తో పోల్చిన ఆయన.. ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించి, మరిన్ని నిధులను కేటాయిస్తే, నష్టం తక్కువగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. మహమ్మారి, దాని వ్యాప్తిని నియంత్రించడానికి దేశాలు తీసుకున్న చర్యలు, ఆర్థిక ప్రభావం మానవీయ సాయం అవసరమయ్యే వారి సంఖ్య 40 శాతం పెరుగుదలకు ఆజ్యం పోశాయని ఐక్యరాజ్యసమితి ఇటీవల వ్యాఖ్యానించింది. మొత్తం 35 బిలియన్ డాలర్ల సహాయ నిధుల కోసం విజ్ఞప్తి చేసింది. ఐక్యరాజ్యసమితి ప్రారంభమైన 75 ఏళ్ల తర్వాత ఇంతటి మానవ సంక్షోభాన్ని ఎదుర్కోలేదు. వ్యాక్సిన్‌ ట్రయల్స్‌లో సానుకూల ఫలితాలు వస్తున్నాయని, ఇక కరోనా అంతమైందన్న కలలు కనొచ్చని పేర్కొన్నారు. టీకా కోసం భారీ తొక్కిసలాట జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇందులో బీద, అభివృద్ధి చెందుతున్న దేశాలు నలిగిపోయే ప్రమాదం ఉందన్నారు. టీకాను ప్రైవేటు సరకుగా కాకుండా ప్రజల ఆస్తిగా పరిగణించాలన్నారు. కొన్ని దేశాల్లో స్వప్రయోజనాల స్వార్థంతో కరోనా కేసులు పెరుగుతున్నట్టు టెడ్రోస్‌ పేర్కొన్నారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3ghKHQ7

No comments:

Post a Comment