Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Monday, 7 December 2020

ఇరాన్ శాస్త్రవేత్త హత్య: బయటపడ్డ అసలు నిజం.. శాటిలైట్ కంట్రోల్ గన్‌తో కాల్పులు!

ఇరాన్‌కు చెందిన ప్రముఖ అణుశాస్త్రవేత్త మొసిన్ ఫ‌క్రిజాదే గ‌త వారం దారుణ హ‌త్య‌కు గురైన విష‌యం విదిత‌మే. అయితే ఫ‌క్రిజాదేను శాటిలైట్ కంట్రోల్డ్ మిషిన్ గ‌న్‌తో హ‌త్య చేసిన‌ట్లు ఇరాన్‌ అధికారిక మీడియా మెహ్ర్ న్యూజ్ ఏజెన్సీ వెల్ల‌డించింది. ఆయనను కృత్రిమ మేధస్సును ఉపయోగించి హత్యచేశారని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ డిప్యూటీ కమాండర్ అలీ ఫదావీ పేర్కొన్నట్టు మెహ్ర్ న్యూస్ తెలిపింది. అణు శాస్త్రవేత్త ఫ‌క్రిజాదే హ‌త్య‌పై పలు ఊహాగానాలు వినిపించాయి. బాడీగార్డుల మ‌ధ్య జ‌రిగిన కాల్పుల్లో ఆయ‌న‌కు బుల్లెట్లు త‌గిలి చ‌నిపోయిన‌ట్లు కథనాలు వెలువడ్డాయి. Read Also: అంతేకాదు, రిమోట్ కంట్రోల్డ్ మెషిన్ గ‌న్‌తో ఫ‌క్రిజాదేను హ‌త్య చేసిన‌ట్లు వార్త‌లు వచ్చాయి. ఫ‌క్రిజాదే హత్యకు గురయినప్పుడు ఆయన భార్య ప‌క్క‌నే ఉన్న‌ప్ప‌టికీ ఆమెకు ఒక్క చిన్న గాయం కాలేదు. ఫ‌క్రిజాదే శరీరంలోని 13 బుల్లెట్లు దిగగా.. ఆయన అంగరక్షకులు 11 మంది వేర్వేరు కార్ల‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇరాన్ ర‌క్ష‌ణ‌శాఖ‌కు చెందిన రిసెర్చ్ అండ్ ఇన్నోవేష‌న్ ఆర్గ‌నైజేష‌న్ చీఫ్‌గా బాధ్యతలు నిర్వహించిన మోషెన్ ఫ‌క్రిజాదే.. ఆ దేశ అణ్వాయుధ కార్యక్రమంలో కీలకంగా వ్యవహరించారు. Read Also: అణు శాస్త్ర‌వేత్త హ‌త్య‌లో ఇజ్రాయేల్ పాత్ర ఉన్న‌ట్లు ఇరాన్ ఆరోపిస్తోంది. గత పదేళ్లలో ఇరాన్‌కు చెందిన ఐదుగురు అణుశాస్త్ర‌వేత్త‌ల‌ను ఇజ్రాయేల్ హ‌త‌మార్చిందని ఆరోప‌ణ‌లు గుప్పించింది. అమెరికా ప్రోద్బలంతోనే ఈ హత్యకు పాల్పడిందని మండిపడుతోంది. ఈ ఏడాదిలో ఇరాన్‌కు చెందిన కీలక నేతలు ఇద్దరు హత్యకు గురయ్యారు. జనవరిలో రివల్యూషనరీ గార్డ్స్ చీఫ్ ఖాసిం సులేమానీని బాగ్దాద్ విమానాశ్రయంలో అమెరికా దళాలు హతమార్చిన విషయం తెలిసిందే. Read Also: తమ శాస్త్రవేత్త హత్యపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఆ హ‌త్య‌కు ప్ర‌తీకారం తీర్చుకుంటామ‌ని ఇరాన్ ప్ర‌భుత్వం ప్రకటించింది. ఇరాన్‌లో కోవ‌ర్ట్ న్యూక్లియ‌ర్ ప్రోగ్రామ్‌లో ఫ‌క్రిజాదేకు ప్ర‌మేయం ఉన్న‌ట్లు ఇంటెలిజెన్స్ వ‌ర్గాలు పేర్కొన్నాయి. అయితే, తాము చేప‌డుతున్న అణు కార్య‌క్ర‌మం శాంతి కోస‌మే అంటూ ఇరాన్ ప్ర‌క‌టించింది. ఇరాన్ ఆరోపణలపై ఇజ్రాయేల్ మాత్రం ఇంత వరకు స్పందించలేదు. కానీ, ప్రధాని బెంజమిన్ నెతన్యాహు 2018 ఏప్రిల్‌లో ఇరాన్ అణు కార్యక్రమంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌ ఇచ్చినప్పుడు శాస్త్రవేత్తను గుర్తించడం గమనార్హం.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3qzqkTb

No comments:

Post a Comment