
బస్సుల్లో ప్రయాణిస్తోన్న సమయంలో ఆకతాయిల అసభ్య ప్రవర్తన చాలా మందిని ఇబ్బంది పెడుతుంటుంది. మహిళా కండక్టర్లను అసభ్యంగా తాకుతూ... తోటి మహిళా ప్రయాణికుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ రాక్షసానందం పొందుతుంటారు. వీరికి చెక్ పెట్టేలా మహారాష్ట్రలోని ఆర్టీసీ అధికారులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. కండక్టర్లు, తనిఖీ అధికారుల చొక్కా ముందు జేబుల్లో బాడీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న వారి ప్రవర్తన ఎలా ఉందనేది ఈ కెమెరాల్లో రికార్డవుతుంది. అంతే కాకుండా రియల్ టైంలో టికెట్ల పరిశీలన సాధ్యమవుతుందని ఔరంగాబాద్ స్మార్ట్ సిటీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారి ఒకరు తెలిపారు. రక్షణ శాఖలో పని చేసి పదవీ విరమణ పొందిన వారిని లైన్ ఇన్‌స్పెక్టర్లుగా నియమించారు. వీరు ప్రయాణికుల భద్రతను పర్యవేక్షిస్తారు. అలాగే ప్రయాణికుల అభిప్రాయాలను అధికారులకు చేరవేస్తారు.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2VLoOz3
No comments:
Post a Comment