Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Monday, 29 March 2021

కోవిడ్-19పై WHO అధ్యయనం.. చైనాకే వంతపాడిందా? నివేదికలో ఏముంది?

చైనాలో తొలిసారి వెలుగుచూసిన కారణంగా పదిహేను నెలల నుంచి ప్రపంచదేశాలకు కంటిమీద కునుకే కరవయ్యింది. కరోనా వైరస్ దెబ్బకు అన్ని దేశాలూ సంక్షోభంలో కూరుకుపోయాయి. అయితే, మహమ్మారి మొదలై ఏడాది గడచిపోయినా దీని మూలాలు అంతచిక్కడం లేదు. ఎప్పుడు, ఎలా మొదలైందనే అంశంపై స్పష్టత రాలేదు. ఈ అంశంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) బృందం దర్యాప్తు ఇటీవల పూర్తయినా నివేదిక ఇంకా బయటకు రాలేదు. కానీ, ముందుగానే దీనిపై చైనా వివరణ ఇవ్వడం గమనార్హం. వుహాన్ ల్యాబ్ నుంచి వైరస్ బయటకొచ్చిందనడంలో ఎటువంటి నిజం లేదని తేల్చిచెప్పింది. కేవలం గబ్బిలాలు, శీతలీకరించిన ఆహారం ద్వారానే వైరస్‌ వ్యాప్తి జరిగి ఉంటుందని పేర్కొంది. డబ్ల్యూహెచ్‌వో దర్యాప్తు సైతం తమ నివేదికలో ఇవే విషయాలు పేర్కొన్నట్లు వెల్లడయ్యింది. కరోనా మూలాలపై డబ్ల్యూహెచ్‌ఓ రూపొందించిన నివేదిక ముసాయిదా ప్రముఖ పత్రిక అసోసియేటెడ్‌ ప్రెస్‌ (ఏపీ) చేతికి చిక్కింది. దీనిపై అసోసియేటెడ్ ప్రెస్ ఓ కథనం ప్రచురించింది. కరోనా వ్యాప్తికి సంబంధించిన డబ్ల్యూహెచ్ఓ నిపుణుల బృందం మొత్తం నాలుగు అంశాలను పరిగణనలోకి తీసుకున్నారని, వీటిలో గబ్బిలాల నుంచి ఒక మధ్యంతర జంతువులోకి వ్యాపించి.. దాన్నుంచి మానవులకు విస్తరించిందని నిర్ధారణకు వచ్చారని పేర్కొన్నట్లు వెల్లడించింది. ల్యాబ్‌ నుంచి వైరస్‌ లీక్‌ అయ్యే అవకాశాలను డబ్ల్యూహెచ్ఓ కొట్టిపారేసినట్లు తెలిపింది. గబ్బిలాల్లోని కరోనా వైరస్, SARS-CoV-2ల సారుప్యత దశాబ్దాలుగా కనుమరుగైన సంబంధాలను సూచిస్తుందని నివేదిక పేర్కొందని వివరించింది. పాంగోలిన్‌లోనూ ఈ వైరస్ గుర్తించగా, మింక్, పిల్లుల్లోనూ కోవిడ్-19 ఉన్నట్టు భావిస్తున్నారని, వీటి ద్వారా కూడా వ్యాపించి ఉండొచ్చని పేర్కొన్నట్టు ఏపీ తెలిపింది. చైనా ఇచ్చిన వివరణే డబ్ల్యూహెచ్ఓ నివేదికలోనూ అదే ఉండటం గమనార్హం. వాస్తవానికి ఈ నివేదికను ఇప్పటికే విడుదల చేయాల్సి ఉండగా.. జాప్యం జరుగుతుండటంపై పలు సందేహాలకు తావిస్తోంది. కరోనా వైరస్ మహమ్మారిగా మారడానికి చైనాయే కారణమన్న అపవాదును పొగొట్టుకోడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థపై ఆ దేశం ఒత్తిడి తెస్తోందా? అనే అనుమానాలు రేకుత్తుతున్నాయి. ఈ డ్రాఫ్ట్‌ నివేదికను డబ్ల్యూహెచ్ఓ సభ్య దేశానికి చెందిన పేరు చెప్పడానికి ఇష్టపడని దౌత్యవేత్త ఒకరు బయటపెట్టినట్లు ఏపీ పేర్కొంది. అయితే తుది నివేదికను ఇలాగే ఉంటుందా? రా లేదా ఏవైనా మార్పులు చేస్తారా? అన్నదానిపై స్పష్టత లేదు. గతవారం ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుడు ఒకరు మాట్లాడుతూ.. కొద్ది రోజుల్లోనే నివేదిక వెల్లడించనున్నట్టు వ్యాఖ్యానించారు. డిసెంబరు 2019లో కరోనా వైరస్‌ తొలిసారిగా చైనాలోని వుహాన్‌ నగరంలో వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌వోకు సంబంధించిన అంతర్జాతీయ నిపుణుల బృందం ఈ ఏడాది జనవరి-ఫిబ్రవరి మధ్య వుహాన్‌లో పర్యటించింది. చైనా శాస్త్రవేత్తలతో కలిసి వారు పరిశీలనలు సాగించారు. తుది నివేదికపై రెండు పక్షాలూ ఆమోదం తెలపాల్సి ఉంది.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2O2A4qx

No comments:

Post a Comment