Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Monday, 29 March 2021

నందిగ్రామ్‌లో దీదీ ఎన్నికల ప్రచారం.. వీల్‌చైర్‌ పాదయాత్ర

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ రసవత్తరంగా సాగుతోంది. అధికార , , కాంగ్రెస్-వామపక్ష కూటమిలు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. తొలి దశలో 30 నియోజకవర్గాలకు పోలింగ్ ముగియడంతో ఏప్రిల్ 6న రెండో దశ పోలింగ్ జరగనుంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీలో ఉన్న నందిగ్రామ్ అసెంబ్లీ కూడా రెండో విడతలోనే ఉంది. నందిగ్రామ్‌లో నామినేషన్ సందర్భంగానే సీఎం గాయపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె కాలిగాయంతోనే ప్రచారం చేస్తున్నారు. వీల్ ఛైర్‌తో ఎన్నికల ప్రచారంలో దీదీ పాల్గొంటున్నారు. కాగా, నందిగ్రామలో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించిన దీదీ.. వీల్‌ ఛైర్‌లోనే ఎనిమిది కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేశారు. దీనికి సంబంధించిన వీడియో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది. భారీగా హాజరైన జనసందోహం, టీఎంసీ కార్యకర్తలు జెండాలు పట్టుకుని ఉండగా మమత వీల్‌ఛైర్‌లో కూర్చుని ప్రచారం చేసినట్టు వీడియోలో కనిపిస్తోంది. ఇక్కడ ఏప్రిల్ 6న ఎన్నిక జరగనుండగా.. ఏప్రిల్ 4న ప్రచారం ముగియనుంది. ఈ నేపథ్యంలో టీఎంసీ, బీజేపీ హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. మమతా బెనర్జీపై మాజీ మంత్రి సువేందు అధికారి పోటీలో ఉన్నారు. టీఎంసీలో ఆమెకు కుడిభుజంగా ఉన్న సువేందు.. ఇటీవలే బీజేపీలో చేరి నందిగ్రామ్ నుంచి బరిలో దిగారు. ఇక, తనపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారని, కారులో నుంచి లాగేశారని దీదీ ఆరోపించారు. అయితే, ఆమెకు ప్రమాదవశాత్తు గాయమైందని, దాడి జరగలేదని ఈసీ నివేదిక పేర్కొంది. అయితే, సీఎం భద్రత విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించిన పోలీస్ అధికారిని ఈసీ విధుల నుంచి తప్పించింది. వరుసగా మూడోసారి అధికారం కోసం టీఎంసీ, బెంగాల్‌ కోటలో తొలిసారి పాగావేయాలని బీజేపీ కృతనిశ్చయంతో ఉన్నాయి. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తోంది. బీజేపీ అగ్రనాయకత్వం మొత్తం బెంగాల్‌లోనే పాగావేసింది. మొత్తం ఎనిమిది దశల్లో ఎన్నికలు జరుగుతుండగా.. మే 2న ఫలితాలు వెల్లడికానున్నాయి.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3dcQDbX

No comments:

Post a Comment