పశ్చిమ్ బెంగాల్, తమిళనాడు, అసోం, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతుండగా.. దేశంలోని మొత్తం పార్లమెంట్ స్థానాల్లో ఐదో వంతు వీటిలోనే ఉన్నాయి. బెంగాల్, అసోంలో తొలి దశ ఎన్నికల పోలింగ్ శనివారం (మార్చి 27) ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యింది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. బెంగాల్‌లోని 30 స్థానాలు, అసోంలోని 47 స్థానాలకు నేడు పోలింగ్ జరుగుతోంది. ప్రస్తుతం పోలింగ్ జరుగుతున్న బెంగాల్‌లోని 30 స్థానాల్లో అధిక శాతం గిరిజన, ఆదివాసీ ప్రాంతాలే ఉన్నాయి. అక్కడ 191 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుండగా.. వీరిలో 21 మంది మహిళలు ఉన్నారు. బెంగాల్‌లో మొత్తం 10,288 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా... 73,80,842 మంది తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. అసోంలో మొత్తం 11,537 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేయగా.. 81.09 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ దశలోనే అసోం ముఖ్యమంత్రి శర్వానంద్ సోనోవాల్, స్పీకర్ హితేంద్ర నాథ్ గోస్వామి, పీసీసీ అధ్యక్షుడు రిపున్ బోరా తదితరులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అక్కడ మొత్తం 235 మంది పోటీలో ఉన్నారు. పశ్చిమ్ బెంగాల్‌లో మొత్తం 294 స్థానాలుగానూ ఎనిమిది దశల్లోనూ, అసోంలో 126 స్థానాలకు మూడు దశల్లోనూ ఎన్నికల జరుగుతున్నాయి. బెంగాల్‌లో తొలి దశ పోలింగ్ జరుగుతున్న చోట్ల రెండేళ్ల కిందట జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 46 శాతం ఓట్లు సాధించింది. బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌కు బీజేపీ గట్టిపోటీనిస్తోంది. దేశం దృష్టిని ఆకర్షించిన నందిగ్రామ్ అసెంబ్లీకి ఏప్రిల్ 1న రెండో దశలో పోలింగ్ జరగనుంది. ఇక్కడ పశ్చిమ్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో బీజేపీ అభ్యర్థిగా సువేందు అధికారి పోటీపడుతున్నారు. మమతకు కుడి భుజంగా ఉన్న సువేందు.. మంత్రి పదవికి రాజీనామా చేసి ఇటీవలే బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. నందిగ్రామ్‌లో మమతా బెనర్జీ పోటీలో నిలవడం వల్ల ఆ ప్రాంతంలో కలిసొస్తుందని టీఎంసీ భావిస్తోంది. 2016 ఎన్నికల్లో ఈ ప్రాంతంలో మొత్తం 27 స్థానాల్లో విజయం సాధించిన తృణమూల్ కాంగ్రెస్.. ప్రస్తుతం అదే ఫలితాలు వస్తాయని అంచనా వేస్తోంది. ఒకప్పుడు కమ్యానిస్టులకు కంచుకోటగా ఉన్న ఈ ప్రాంతంలో క్రమంగా వారు ఉనికే ప్రశ్నార్ధకంగా మారింది. 2016-2019 మధ్య దాని ఓట్ల శాతం 28 నుంచి 5%కి పడిపోయింది.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3csIJMm
No comments:
Post a Comment