Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Friday, 26 March 2021

తిరుపతి సహా అన్ని బైపోల్స్‌కు కొత్త వెసులుబాటు.. వారికి పోస్టల్ బ్యాలెట్

తిరుపతి సహా దేశవ్యాప్తంగా జరగనున్న పార్లమెంట్, అసెంబ్లీ ఉప-ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) కొత్త వెసులుబాటు ఇచ్చింది. కోవిడ్-19 ప్రభావిత వ్యక్తులు, 80 ఏళ్లుదాటినవారు పోలింగ్ కేంద్రాలకు రాకుండానే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నట్టు ఈసీ వెల్లడించింది. వీరంతా ద్వారా ఓటేయొచ్చని పేర్కొంది. వీరంతా పోస్టల్ బ్యాలెట్ కోసం నియోజకవర్గం పరిధిలోని రిటర్నింగ్ అధికారికి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ వెసులుబాటు కేవలం ఉప-ఎన్నికలు జరుగుతున్న చోటే ఉంటుందని స్పష్టం చేసింది. పోస్టల్ బ్యాాలెట్ కోసం నోటిఫికేషన్ వెలువడిన ఐదు రోజుల తర్వాత దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గతేడాది జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ కోవిడ్-19 తీవ్రంగా వ్యక్తులకు పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించింది. ఇదిలా ఉండగా, 2024 సాధారణ ఎన్నికల నాటికి దేశంలో ఈ-ఓటింగ్ అందుబాటులోకి రానుంది. ‘రిమోట్ ఓటింగ్’ సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్టు ఇటీవల కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ ఆరోరా వెల్లడించారు. బహుశా ఈ విధానం 2024 లోక్‌సభ ఎన్నికల నాటికి అందుబాటులోకి రావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. రిమోట్ ఓటింగ్ పైలట్ ప్రాజెక్ట్ వచ్చే రెండు మూడు నెలల్లో ప్రారంభం కానుందని పేర్కొన్నారు. ‘ఐఐటీ మద్రాస్, ఇతర ఐఐటీలకు చెందిన నిపుణులు, టెక్నోక్రాట్స్ రిమోట్ ఓటింగ్ లేదా బ్లాక్‌చైన్ ఓటింగ్ విధానంపై తీవ్రంగా కృషిచేస్తున్నారు.. తొలి పైలట్ ప్రాజెక్ట్ రాబోయే రెండు మూడు నెలల్లో ప్రారంభమవుతుందనే ఆశాభావంతో ఉన్నాం’ అని సంసద్ రత్న అవార్డుల బహుకరణ కార్యక్రమంలో పాల్గొన్న సునీల్ అరోరా అన్నారు. ఎన్ఆర్ఐలకు ఓటు హక్కునకు సంబంధించి ప్రాజెక్టు ఆరు నుంచి ఏడాదిలోగా పూర్తికావచ్చని అశాభావం వ్యక్తం చేశారు. అధార్‌తో ఓటును అనుసంధానం చేయాలన్న ఈసీ ప్రతిపాదనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని ఇటీవల కేంద్ర న్యాయశాఖ చేసిన ప్రకటనను సునీల్ అరోరా స్వాగతించారు. దీని వల్ల ఒక వ్యక్తికి ఒక చోటే ఓటు ఉంటుందని అన్నారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3da1x2a

No comments:

Post a Comment