Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Saturday, 14 August 2021

మన కంటే ఒకరోజు ముందే పాక్‌లో స్వాతంత్య్ర దినోత్సవం... తెరవెనుక ఇంత పెద్ద స్టోరీ ఉందా?

భారతావని 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సిద్ధమైంది. ఆగస్టు 15(ఆదివారం) ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎర్రకోట మీద జాతీయ జెండాను ఆవిష్కరించి వేడుకల్లో పాల్గొననున్నారు. అదే సమయంలో దేశ ప్రజలంతా పంద్రాగస్టు సంబరాలు చేసుకోనున్నారు. దాదాపు 200 ఏళ్ల బ్రిటిష్ పాలనలో మగ్గిపోయిన యావత్ భారతావని ఎన్నో పోరాటాలు, మరెన్నో ప్రాణత్యాగాలు చేసి స్వాతంత్య్రాన్ని సాధించుకుంది. 1947వ సంవత్సరం ఆగస్టు 15న భారతదేశం బ్రిటిష్ పాలన నుంచి పూర్తిగా విముక్తి పొంది స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంది. Also Read: బ్రిటిష్ పాలన నుంచి విముక్తి లభించిన రోజునే మనం స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకోవడం మన ఆనవాయితీగా వస్తోంది. అయితే మన దాయాది దేశం మాత్రం ఏటా ఆగస్టు 14న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటుంది. స్వాతంత్య్ర వచ్చే సమయానికి రెండు దేశాలు కలిసే ఉన్నాయి కదా.. అలాంటిది పాకిస్థాన్ మనకంటే ఒకరోజు ముందు వేడుకలు ఎందుకు నిర్వహిస్తుందోనని తరుచూ సందేహం వస్తుంటుంది. అయితే దాని వెనుక ఓ ఆసక్తికరమైన కారణం ఉంది. అదేంటో తెలుసుకుందాం... బ్రిటిష్ భారత్ చివరి వైస్రాయ్, భారతదేశ మొదటి గవర్నర్.. జనరల్ అయిన లార్డ్ మౌంట్‌బట్టన్...పాకిస్తాన్ పరిపాలన అధికారాన్ని ముహమ్మద్ అలీ జిన్నాకు ఆగస్టు 14, 1947న కరాచీలో బదిలీ చేశారు. ఇండియా, పాకిస్తాన్ స్వతంత్ర దేశాలుగా మారే తేదీ ఆగస్టు 15 కాగా.. తమకు ఆగస్టు 14నే అధికార మార్పిడి జరిగినందున పాకిస్థాన్ ఆరోజునే స్వాతంత్ర్య దినోత్సవంగా స్వీకరించింది. అలాగే జూన్ 1948లో పాకిస్తాన్ మొదటి ప్రధాని లియాఖత్ అలీ ఖాన్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఇండియా కంటే ముందు స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రతిపాదించారు. అప్పటి నుంచి ఆగస్టు 14నే పాకిస్థాన్‌లో ఇండిపెండెంట్స్ వేడుకలు జరుపుకుంటారు. దీనికి మరో కారణమూ ఉంది.. భారత కాలమానం(Indian Standard Time) పాకిస్తాన్ కాలమానం కంటే 30 నిమిషాల ముందు ఉంటుంది. ఇండియా 1947, ఆగస్టు 14 అర్ధరాత్రి సరిగ్గా 12 గంటలకు స్వతంత్ర దేశంగా అవతరించింది. కాలమానం ప్రకారం చూస్తే పాకిస్థాన్‌లో అప్పుడు సమయంలో ఆగస్టు 14వ తేదీ రాత్రి 11.30 గంటలు అయింది. అందుకే పాకిస్థాన్‌లో స్వాతంత్య దినోత్సవ వేడుకలను ఆగస్టు 14నే జరుపుకుంటారు.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/3AJ9fdO

No comments:

Post a Comment