Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Thursday, 26 August 2021

ఆ వాగ్దానాన్ని తాలిబన్లు ఉల్లంఘించారు.. అఖిలపక్ష భేటీలో కేంద్రం కీలక వ్యాఖ్యలు

అఫ్గన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న తర్వాత అక్కడి పరిస్థితులు, భారతీయుల భద్రతపై కేంద్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. గురువారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో అక్కడ పరిస్థితులపై అన్ని పార్టీల నేతలకు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ క్లుప్తంగా వివరించారు. మంత్రి జైశంకర్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగిన విషయం తెలిసిందే. అక్కడ చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకురావడమే తమ ప్రధాన కర్తవ్యమని కేంద్రం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. అఫ్గన్‌లో పరిస్థితి దారుణంగా ఉందని, యుద్ధాన్ని వాతావరణం నెలకుందని అభిప్రాయపడింది. దోహా శాంతి ఒప్పందం సందర్భంగా ఇచ్చిన వాగ్దానాలను తాలిబన్లు ఉల్లంఘిస్తున్నారని మండిపడింది. అమెరికా, నేతల మధ్య గతేడాది ఫిబ్రవరిలో దోహా వేదికగా శాంతి ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. అఫ్గన్‌ సమాజంలోని అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వహించే కాబూల్‌లో మత స్వేచ్ఛ, ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఊహించామని వ్యాఖ్యానించింది. పార్లమెంట్ హౌస్‌లోని జరిగిన అఖిలపక్ష సమావేశానికి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, రాజ్యసభ బీజేపీపక్ష నేత పియూష్ గోయల్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సైతం హాజరయ్యారు. అఫ్గన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించడానికి ‘ఆపరేషన్ దేవీశక్తి’ని కేంద్రం ప్రారంభించింది. ఈ సమావేశానికి ఎన్‌సీపీ నేత శరద్ పవార్, రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజ్ చౌధురి, డీఎంకే నుంచి టీఆర్ బాలు, మాజీ ప్రధాని దేవెగౌడ, అప్నాదళ్ నుంచి అనుప్రియా పటేల్, వైఎస్ఆర్సీపీ నుంచి మిథున్ రెడ్డి, టీడీపీ నుంచి గల్లా జయదేవ్, టీఆర్ఎస్ నుంచి నామానాగేశ్వరరావు తదితర పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు. మరోవైపు, అఫ్గన్ నుంచి వచ్చే శరణార్థులు భారత్‌లో తాత్కాలికంగా ఆశ్రయం పొందాలనుకుంటే ఈ-వీసా తీసుకోవాలని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. గతంలో వీసాలు తీసుకుని, ప్రస్తుతం భారత్‌లో లేనివారి వీసాలు కూడా చెల్లుబాటు కావని తెలిపింది. వారు సైతం కొత్తగా ఈ-వీసా తీసుకోవాల్సిందేనని పేర్కొంది.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/3gA2UJP

No comments:

Post a Comment