
దాదాపు రెండు శతాబ్దాల పాటు భారతదేశాన్ని తమ కబంధహస్తాల్లో నలిపేసిన బ్రిటిషర్లు.. పొతూ పోతూ మత ప్రాతిపదిక దేశాన్ని రెండుగా విడగొట్టారు. భారత్‌కు స్వాతంత్ర్యం రావడానికి కొద్ది గంటల ముందే భారతావని రెండు ముక్కలయ్యింది. స్వాతంత్రానికి కొన్ని గంటల ముందు భారత్ నుంచి పాకిస్థాన్ విడిపోయి ప్రత్యేక దేశంగా ఆవిర్భవించింది. ఆ విభజన సమయంలో జరిగిన అల్లర్లలో లక్షల మంది ఊచకోతకు గురికాగా.. కోట్లాది మంది నిరాశ్రయులయ్యారు. విభజన గాయాలు భారతీయులను దశాబ్దాలుగా వెంటాడుతున్నాయి. పాకిస్థాన్‌లో మత్మోనాద శక్తులు రెచ్చిపోయి.. దాడులకు తెగబడ్డాయి. లక్షలాది మంది ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని భారత్‌కు తరలివచ్చారు. ఈ నేపథ్యంలోనే జరిగిన ఆగస్టు 14పై ప్రధాని నరేంద్ర మోదీ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 14ను ఇకపై ‘విభజన భయాన స్మారక దినం’గా పాటించాలని పిలుపునిచ్చారు. ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘దేశ విభజన నాటి గాయాలను ఎన్నటికీ మరువలేం.. మతిలేని ద్వేషం, హింస వల్ల కొన్ని లక్షల మంది మన సోదరులు, సోదరీమణులు నిరాశ్రయులయ్యారు.. ఎందరో ప్రాణాలను కోల్పోయారు. మన ప్రజల త్యాగాలు, కష్టాలను గుర్తు చేసుకునేందుకు.. ఆగస్టు 14ను ఇకపై ‘విభజన భయానకాల స్మారక దినం’గా ప్రకటిస్తున్నాం’ అని మోదీ ట్వీట్ చేశారు. దీనితోనైనా సామాజిక వ్యత్యాసాలు, విరోధం వంటివి తొలగిపోతాయని ఆశిద్దామని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఐకమత్యమే మహాబలం అన్న నానుడిని, సామాజిక సామారస్యాన్ని, మానవాళి అభివృద్ధిని బలోపేతం చేసే దిశగా ‘విభజన భయానకాల స్మారక దినం’ పాటిద్దామంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. దేశ విభజన సమయంలో పశ్చిమ్ బెంగాల్‌లోని నోఖాలి, బిహార్‌లో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. దీంతో నోఖాలి జిల్లాలో శాంతి, మతసామరస్యాన్ని నెలకొల్పడానికి మహాత్మా గాంధీ అక్కడ ఉండాలని నిర్ణయించుకున్నారు.
from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/37JZHm9
No comments:
Post a Comment