ముంబయిలో భారీ అగ్ని ప్రమాదం.. ముగ్గురు సజీవదహనం

దేశ ఆర్ధిక రాజధాని నగరంలో శనివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు సజీవదహనం కాగా.. మరో 17 మంది గాయపడ్డారు. టార్డియోలోని భాటియా ఆస్పత్రి సమీపంలో.. 20 అంతస్తుల భవనంలోని 18వ ఫ్లోర్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. గాయపడిన మరో 16 మందిని అధికారులు చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆరుగురు వృద్ధులకు ఆక్సిజన్ సపోర్ట్‌తో చికిత్స అందిస్తున్నామని ముంబయి మేయర్ కిశోరి పెడ్నేకర్ వెల్లడించారు. కమలా బిల్డింగ్లోని 18వ అంతస్తులో ఉదయం 7 గంటల సమయంలో మంటలు చెలరేగాయని ఆయన పేర్కొన్నారు. అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మొత్తం 13 అగ్నిమాపక యంత్రాలతో మంటలను మంటలను అదుపులోకి తెచ్చారు. మంటల్లో చిక్కుకున్నవారిని బయటకు తీసుకొచ్చారు. అయితే, ప్రమాదంతో పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగ అలుముకుంది. భాటియా ఆస్పత్రిలో 15 మంది క్షతగాత్రులకు చికిత్స కొనసాగుతోంది. వీరిలో 12 మంది సాధారణ వార్డు, ముగ్గురు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మంగల్ లోధా తీవ్ర విచారం వ్యక్తం చేశారు.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/3ApfeVX

Post a Comment

0 Comments