Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Sunday, 20 February 2022

కెనడాలో ఆందోళనలను అడ్డుకున్న పోలీసులు.. 170 మంది అరెస్ట్

ఉధృతం అయ్యాయి. ట్రక్ డ్రైవర్లకు వ్యాక్సిన్‌ను తప్పనిసరి చేయడంతో ఫ్రీడమ్ కాన్వాయ్ పేరుతో నిరసనలు మొదలయ్యాయి. దీంతో ప్రజల మద్దతు కూడా తోడవ్వడంతో నిరసనలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. ఈ క్రమంలో ఆందోళనకారులు కెనడా రాజధాని ఒట్టావాలో పార్లమెంట్‌కు వెళ్లే రహదారులను నిర్బంధించారు. రోడ్లపైనే వాహనాలను నిలిపివేసి, అక్కడే గూడారాలు కూడా ఏర్పాటు చేసుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. నిరసనలు విరమించాలని ప్రభుత్వం వారిని హెచ్చరిస్తూనే ఉంది. దీంతో శనివారం పోలీసులు రంగంలోకి దిగి బలవంతంగా గూడారాలను తొలగించే ప్రయత్నం చేశారు. అయినా నిరసనలు విరమించకపోవడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఆందోళన కారులపై పెప్పర్ స్ప్రే ప్రయోగించారు. ఒక రోజంతా ఇది జరిగింది. అలాగే వందలాది మందిపై పోలీసులు కేసులు పెట్టారు. మొత్తం 170 మందికిపైగా అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన వారి బ్యాగుల్లో పొగ గ్రెనేడ్లు, ఇతర పేలుడు పదార్థాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో శాంతి భద్రతలను దెబ్బతీసే విధంగా నిరసనలు మరింత ఉధృతం అయ్యే అవకాశాలున్నట్టు పోలీసులు ధ్రువీకరించుకున్నారు. ఈ క్రమంలో ఆందోళనలను అడ్డుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. కాగా మరోవైపు నిరసన కారులు పోలీసుల చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/k8GecVZ

No comments:

Post a Comment