కశ్మీర్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 5.9గా నమోదు

శనివారం ఉదయం జమ్మూ కశ్మీర్‌లో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. కశ్మీర్ లోయ సహా జమ్మూ డివిజన్‌లో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నట్టు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం వెల్లడించింది. ఇవి రిక్టర్ స్కేల్‌పై 5.9 తీవ్రతగా నమోదయినట్టు తెలిపింది. శనివారం ఉదయం 9.45 ప్రాంతంలో ఈ భూ ప్రకంపనలు చోటుచేసుకున్నట్టు పేర్కొంది. ఈ భూకంప కేంద్రం 180 కిలోమీటర్ల లోతులో ఉన్నట్టు గుర్తించినట్టు తెలియజేసింది. ఈ భూకంప కేంద్రం అఫ్గనిస్థాన్-తజికిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో ఉన్నట్టు తెలిపింది. అంతకు ముందు శనివారం తెల్లవారుజామున ఉత్తరాఖండ్‌లో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఉత్తరకాశీ జిల్లాలో వచ్చిన ఈ భూ ప్రకంపనలు రిక్టర్ స్కేల్‌పై 3.6గా నమోదయినట్టు ఎన్‌ఎస్‌సీ తెలిపింది. ఉత్తరకాశీకి వాయువ్యంగా 58 కిలోమీటర్ల దూరంలో 10 కి.మీ. లోతను ఈ భూకంప కేంద్రం ఉన్నట్టు పేర్కొంది. అయితే, భూకంపం వల్ల ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిళ్లలేదని చెప్పింది. అటు, , ఢిల్లీ సరిహద్దుల్లోని నొయిడా సహా ఉత్తర భారతంలో పలు చోట్ల భూ ప్రకంపనలు చోటుచేసుకున్నా.. దీని తీవ్రత మాత్రం కచ్చితంగా మాత్రం తెలిరాలేదు. భూకంప తీవ్రతపై శ్రీనగర్ మేయర్ జునైద్ అజిమ్ మట్ ట్విట్టర్‌‌లో స్పందించారు. ‘‘ఇది చాలా శక్తివంతమైన భూకంపం.. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకారం పాకిస్థాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌కు నైరుతిగా 189 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రాన్ని గుర్తించారు.. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 7.3గా నమోదయ్యింది’’ అని ఆయన ట్వీట్ చేశారు.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/vY7iC6o

Post a Comment

0 Comments