Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Wednesday, 16 February 2022

నేను సైతం రష్యాతో యుద్ధానికి.. శిక్షణ తీసుకుంటున్న 79 ఏళ్ల ఉక్రెయిన్ బామ్మ

రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న వివాదం మరింత ముదిరి ప్రత్యక్ష దాడి వరకూ వచ్చింది. ఉక్రెయిన్ సరిహద్దుల్లో భారీగా సేనలను మోహరించిన రష్యా.. ఏ క్షణమైనా దాడిచేయవచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ సైన్యంతో పాటు ఆ దేశ ప్రజలు కూడా యుద్ధానికి సన్నద్ధలవుతున్నారు. సాధారణ పౌరులు సైతం కదనరంగంలోకి దూకేందుకు ఆయుధ శిక్షణ తీసుకుంటున్నారు. చిన్నారులు, వృద్ధులు శిక్షణ కోసం స్వచ్ఛందంగా ముందుకు వస్తూ దేశంపై ప్రేమను చాటుకుంటున్నారు. అలాంటి వారిలో ఓ 79 ఏళ్ల వృద్ధురాలు కూడా ఉన్నారు. ఆయుధాల వాడకంలో శిక్షణ తీసుకున్న అనే బామ్మ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాదు, ఆమె తెగువ, ధృడ చిత్తం, దేశభక్తిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘‘నేను దృఢమైన సైనికురాలిని కాకపోవచ్చు.. బరువైన ఆయుధాలను మోయలేకపోవచ్చు.. కానీ, నా దేశం కోసం పోరాడం మాత్రం మానను. నా దేశాన్ని ఓడిపోనివ్వను’’ ఉద్విగ్నంగా ఆమె చెప్పిన మాటలు ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తున్నాయి. తూర్పు ఉక్రెయిన్‌లోని మరియుపోల్‌కు చెందిన వాలెంటినా జాతీయ భద్రతా సిబ్బంది నుంచి ఏకే - 47 తుపాకీని ఎలా ఉపయోగించాలో శిక్షణ తీసుకున్నారు. తుపాకీ చేతబట్టి లక్ష్యానికి గురిపెడుతున్న వాలెంటినా ఫొటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. వయసు కూడా పక్కనబెట్టి దేశం కోసం ముందుకొచ్చిన వాలెంటినాను ఉక్రెయిన్‌ పౌరులతో పాటు ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు అభినందిస్తున్నారు. ‘‘ఏదైనా జరిగితే ఎదుర్కొడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా ఇంటిని, నా పిల్లలను, నా నగరాన్ని నేను రక్షించుకుంటాను. నా దేశాన్ని ఎన్నటికీ ఇతరుల చేతుల్లోకి వెళ్లనివ్వను. నేను బలహీనురాలినే కావొచ్చు. కానీ యుద్ధానికి సిద్ధమే’’ అనే వాలెంతినా మాటలు ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని రగిలిస్తున్నాయి. ఆమెను చూసి యువత, ఇతర వృద్ధులు సైతం శిక్షణలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. భవిష్యత్‌ తరానికి ఇబ్బంది ఉండకూడదంటే తాము యుద్ధం చేయాల్సిందేనని మరియానా జాగ్లో అనే మరో వృద్ధురాలు వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్‌లో నాలుగేళ్ల చిన్నారి నుంచి వృద్ధుల వరకూ.. ఎవర్ని కదిలించినా ఇదే భావోద్వేగం. రష్యా ఆక్రమణ నుంచి దేశాన్ని రక్షించుకోవడం కోసం చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కళ్లూ కదిలి వస్తున్నారు. యుద్ధం ఎదురైతే ‘మేము సైతం’ అంటూ తుపాకులతో శిక్షణ తీసుకుంటున్నారు.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/qIMSwHA

No comments:

Post a Comment