
రాజస్థాన్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. పెళ్లింట విషాద ఛాయలు అలముకున్నాయి. ఆనందంగా పెళ్లికి వెళ్తున్నవారు మృత్యువు బారిన పడ్డారు. పెళ్లి పీటలపై కూర్చోవాల్సిన పెళ్లి కొడుకు నిర్జీవంగా మారాడు. ఉత్సాహంగా వివాహ వేదికకు బయల్దేరిన పెళ్లి బృందం మధ్యలోనే ప్రాణాలను కోల్పోయారు. వరుడుతో సహా తొమ్మిది మంది ఉజ్జయినిలోని వివాహ వేడుకకు కారులో బయల్దేరారు. అయితే ఆ కారు కోటా దగ్గర అదుపు తప్పి అక్కడున్న చంబల్ నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది జల సమాధి అయ్యారు. ఈ దుర్ఘటనలో పెళ్లి కొడుకు కూడా ప్రాణాలు విడిచాడు. దాంతో వారి కుటుంబం దు:ఖ సాగరంలో మునిగిపోయింది. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో స్థానిక అధికారులు, పోలీసులు రంగంలోకి దిగి క్రేన్ సాయంతో కారును బయటకు తీశారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో పెళ్లికుమారుడు కూడా ఉన్నాడని పోలీసులు వెల్లడించారు. కారు దారి తప్పి చిన్న వంతెనపైకి వచ్చిందని, తర్వాత నదిలో పడిపోయిందని పోలీసులు తెలిపారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నామని తెలియజేశారు.
from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/BJO4FnQ
No comments:
Post a Comment