Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Saturday, 19 February 2022

డ్రోన్లతో వ్యాక్సిన్‌లను పంపిణీ చేస్తోన్న ఆర్మీ అధికారులు

సుదూర ప్రాంతాల్లో ఉన్న సాయుధ దళాలకు వ్యాక్సిన్ డోసులను అందించేందుకు ఆర్మీ డ్రోన్‌లను ఉపయోగిస్తోంది. డ్రోన్‌ల ద్వారా వ్యాక్సిన్‌లను పంపిస్తోంది. మిషన్ సంజీవనిలో భాగంగా మారుమూల ప్రాంతాలకు వైద్య సామాగ్రిని, వ్యాక్సిన్లను అందించడానికి ఆర్మీ డ్రోన్లను వినియోగిస్తోంది. జమ్మూ కశ్మీర్‌లో హిమపాతం ఎక్కువగా ఉండడంతో వ్యాక్సిన్లను డ్రోన్ల ద్వారా సరఫరా చేస్తోంది. ఈ డెలివరీ ప్రక్రియ మొత్తం వీడియోను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియోలో వ్యాక్సిన్లను ఓ పెట్టెలో పెట్టి ప్యాక్ చేసి.. దానిని డ్రోన్‌కు పెడుతున్నారు. తర్వాత ఆ డ్రోన్‌ను స్టార్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మొదటగా ఆర్మీ అధికారులు మంచును తొలగించడం, నిర్దేశిత గమ్యస్థానానికి ప్రయాణించే డ్రోన్‌కు వ్యాక్సిన్‌లతో ఉన్న ప్యాకేజీని జత చేయడం, స్పాట్‌లో వేచి ఉన్న అధికారి సమక్షంలో ప్యాకేజీ నేలపై పడడం వంటి దృశ్యాలు కనబడతాయి. అలా కిందకు పడినప్పుడు వ్యాక్సిన్లకు ఎటువంటి నష్టం జరగకుండా టీకాలను ప్యాక్ చేస్తున్నారు. " జమ్మూ కశ్మీర్‌లోని మంచుతో కూడిన ప్రాంతాల్లోని దళాలకు బూస్టర్ డోస్ వ్యాక్సిన్‌ను సరఫరా చేయడానికి భారత సైన్యం డ్రోన్‌లను ఉపయోగిస్తోంది. వ్యాక్సిన్లను రక్షణ కోసం ప్యాక్ చేసి సిద్ధం చేశాం" అని ఆర్మీ ట్విట్టర్‌లో పేర్కొంది. కాగా కొద్ది రోజుల క్రితం, జమ్మూ కశ్మీర్‌లోని బందీపూర్ జిల్లా నుంచి అనారోగ్యంతో బాధపడుతోన్న మహిళను ఆర్మీ అధికారులు రక్షించారు. మంచు కారణంగా వెళ్లలేని స్థితిలో ఉన్న ఫజలీ బేగంను కొందరు ఆర్మీ అధికారులు బరౌబ్ నుంచి ఒకటిన్నర కిలో మీటర్ల వరకూ స్ట్రెచర్‌పై తీసుకెళ్లారు.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/VNUoO9e

No comments:

Post a Comment