
ఉత్తర కొరియా అధినేత మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయన ఏం చేసినా అందులో ఒక ప్రత్యేకత ఉంటుంది. చలికాలంలో కూరగాయల కొరతను తీర్చేందుకు తొలి అడుగు వేశారు. దేశంలోనే అతి పెద్ద కూరగాయల వ్యవసాయ క్షేత్రానికి శంకుస్థాపన చేశారు. అక్కడ అతి పెద్ద నగరమైన హమ్‌హంగ్ సమీపంలో ఈ కార్యక్రమం జరిగింది. నిజానికి చలికాలంలో తాజా కూరగాయలు దొరకక ఉత్తర కొరియన్లు తీవ్ర ఇబ్బందులు పడతారు. వాస్తవానికి చలి కాలంలో ఆ దేశ ప్రజలకు తాజా కూరగాయలు అందవు. అక్కడున్న వాతావరణ పరిస్థితుల రీత్యా శీతాకాలంలో కూరగాయలు పండవు. దాంతో ఆ టైంలో వారు పచ్చళ్లు, ఎండిన కూరగాయలపై ఆధారపడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు కిమ్ పూనుకున్నారు. ఎటువంటి వాతావరణ స్థితిలోనైనా ఏడాదంతా పండే కూరగాయల సాగుకు కిమ్ శ్రీకారం చుట్టారు. దీనికోసం ఎప్పటినుంచో ప్రణాళికలు రచించారు. ఇందులో భాగంగా 250 ఎకరాల్లో కిమ్ గ్రీన్ హౌస్ ఫామ్ హౌస్ నిర్మాణాన్ని చేపట్టారు. ఈ మేరకు ఆయన శుక్రవారం శంకుస్థాపన చేశారు. సైనికులు మంచుతో పేరుకుపోయిన మట్టిని బాంబులతో పేల్చి పనులు ప్రారంభించారు. పైగా ఈ వ్యవసాయ క్షేత్ర పనుల కోసం కిమ్ సైనికులను ఉపయోగిస్తున్నారు. ఈ వ్యవసాయ క్షేత్ర నిర్మాణాన్ని పార్టీ స్థాపన వార్షికోత్సవమైన అక్టోబర్ 10 నాటికి పూర్తి చేయాలని కిమ్ సైనిక సిబ్బందికి సూచించారు. కాగా కిమ్ శంకుస్థాపన చేసిన వెనుదిరిగిన వెంటనే సైనికులు అభిమానంతో ఆయన్ని చుట్టుముట్టారు.
from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/9Jq21OP
No comments:
Post a Comment