కరోనా వైరస్ మహమ్మారి ఒమిక్రాన్ రూపంలో ప్రపంచంపై విరుచుకుపడింది. నెల రోజులు పాటు శాంతించిన వైరస్.. మళ్లీ పలు దేశాల్లో విజృంభించడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. చైనా, హాంకాంగ్, సింగ్‌పూర్, దక్షిణ కొరియా సహా పలు దేశాల్లో రికార్డుస్థాయి కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమయ్యింది. దేశంలో కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్ ప్రక్రియపై సమీక్ష కోసం కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ బుధవారం అత్యుతన్న స్థాయి సమావేశం నిర్వహించారు.
from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/iLQIvCY
0 Comments