ఉక్రెయిన్‌పై దమనకాండను కొనసాగిస్తున్న రష్యా.. బాంబులు, క్షిపణులతో విరుచుకుపడుతోంది. ఈ విధ్వంసంలో ఎందరో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే.. వేలాది మంది గాయాలపాలవుతున్నారు. ప్రాణభయంతో లక్షలాది జనం ఉక్రెయిన్ వీడుతున్నారు. ఈ మారణహోమానికి రష్యా ఇప్పట్లో ముగింపు పలికే సూచనలు కనిపించడంలేదు. యుద్ధం తక్షణమే ఆపేయాలని అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలను కూడా రష్యా గాలికొదిలేసింది. తమ లక్ష్యం నెరవేరే వరకు వెనక్కి వచ్చే ప్రసక్తే లేదని రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ తేల్చిచెప్పారు.
from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/u4pZakC
0 Comments