గతేడాది వర్షకాల పార్లమెంట్ సమావేశాలకు రెండు రోజుల ముందు పెగాసస్ హ్యాకింగ్ వ్యవహారం బయటకు రావడంతో దీనిపై తీవ్ర దుమారం రేగింది. విపక్షాలు పార్లమెంట్‌ను స్తంభింపజేయగా.. పలు పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. తాజాగా, పెగాసస్ స్పైవేర్ గురించి పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సాఫ్ట్‌వేర్ విక్రయంపై తమకు కొన్నేళ్ల క్రితమే ఆఫర్ వచ్చిందని మమతా బెనర్జీ వెల్లడించారు. అయినా తాము కొనుగోలు చేయమని చెప్పామన్నారు.
from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/rjaRIsg
0 Comments